అక్షరటుడే, వెబ్‌డెస్క్: Asian Para Games | ఆసియా పారా గేమ్స్ (Asian Para Games)లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో భారత షూటర్లు రెండు పతకాలు గెలిచి డబుల్ పొడియం దక్కించుకున్నారు. తాజాగా నిషాద్ కుమార్ లాంగ్ జంప్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు.
భారత షూటర్లు మోనా అగర్వాల్ స్వర్ణం సాధించగా, స్టార్ షూటర్ అవని లేఖర రజతం గెలుచుకున్నారు. పురుషుల విభాగంలో రాకేష్ నిడగుండితో పాటు స్వరూప్ ఉన్హల్కర్ నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం కోల్పోయారు. పారా అథ్లెటిక్స్ స్టార్ నిషాద్ కుమార్ లాంగ్ జంప్‌లో అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అతడు 7.11 మీటర్లు దూకాడు. దీంతో భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు చేరాయి.
Asian Para Games | జూడోలో కాంస్యం
జూడో క్రీడాకారుడు కపిల్ పర్మార్, ఇండోనేషియాకు చెందిన రఫ్లీ అహ్నాఫ్ షిద్కీని ఓడించి కాంస్యం గెలుచుకున్నాడు. మహిళల 52 కేజీల విభాగంలో ఫైనల్లో ఓడిపోయిన కోకిల సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకుంది. పారా-ఆర్చరీ సంచలనం శీతల్ దేవి మహిళల కాంపౌండ్ క్వాలిఫికేషన్ రౌండ్లో 720 పాయింట్లకు 704 స్కోరు సాధించి, ప్రపంచ రికార్డును సమం చేసింది.
ఇది కూడా చదవండి..: T20 Ticket Black Marketing | హైదరాబాద్‌లో టీ20 టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ గుట్టురట్టు.. నలుగురి అరెస్టు!