అక్షరటుడే, వెబ్‌డెస్క్: Samsung Galaxy F70 5G | సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ తయారీ సంస్థ అయిన శాంసంగ్ భారత మార్కెట్ లో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. గెలాక్సీ ఎఫ్ 70 5జీ పేరుతో తీసుకువచ్చిన ఈ ఫోన్ లో ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే శాంసంగ్ ఎక్సినాస్ 1330 ప్రాసెసర్ అమర్చారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాలతో వచ్చిన ఈ ఫోన్ ఫస్ట్ సేల్ అక్టోబర్ 20 న ప్రారంభం కానుంది. కంపెనీ అధికారిక వెబ్ సైట్ తోపాటు ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా..
డిస్ప్లే : 6.7 ఇంచ్ ఎఫ్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చిన ఈ ఫోన్.. 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1080 2340 పిక్సల్స్ రిజల్యూషన్ కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఇస్తుంది. ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ సర్టిఫికెట్ ఉంది.
ప్రాసెసర్ : శాంసంగ్ ఎక్సినాస్ 1330 ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యÖఐ 7 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. నాలుగు ఆండ్రాయిడ్ జనరేషన్లు, ఐదేళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్లు అందిస్తామని కంపెనీ ప్రకటించింది.
Samsung Galaxy F70 5G | కెమెరా సెటప్..
వెనకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో సెన్సార్ తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ఇచ్చారు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.
బ్యాటరీ : 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 25డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
Samsung Galaxy F70 5G | రెండు వేరియంట్లలో..
- గెలాక్సీ ఎఫ్ 70 5జీ ఫోన్ వివిధ్ వయోలెట్, బోల్డ్ బ్లాక్ కలర్స్‌లో రెండు స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది.
- 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999.
- 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999.
- ఎంపిక చేసిన కార్డులతో చేసే కొనుగోళ్లపై రూ. 2 వేల వరకు డిస్కౌంట్ లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో అదనంగా 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
ఇది కూడా చదవండి..: Airtel Voice Plans | ఎయిర్టెల్ నుంచి వాయిస్ ప్లాన్లు.. డేటా అవసరంలేనివారికి ప్రయోజనం