అక్షరటుడే, వెబ్‌డెస్క్: Oct 21 Market Analysis | వాల్‌స్ట్రీట్ (Wallstreet) బెంచ్‌మార్క్ సూచీలు గత సెషన్లో మిశ్రమంగా ముగిశాయి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించడంతో ఆసియా మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి.
దిగ్గజ కంపెనీలైన ఎస్కే హైనిక్స్ ఇంక్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ భారీగా పెరిగాయి. గిఫ్ట్ నిఫ్టీ (Gift nifty) పాజిటివ్‌గా ఉండడంతో మన మార్కెట్ సైతం లాభాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Oct 21 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్లో ఎస్ అండ్ పీ 0.28 శాతం లాభపడగా.. నాస్డాక్ 0.02 శాతం నష్టపోయింది. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.06 శాతం నష్టంతో ఉంది.
Oct 21 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.06 శాతం, ఫ్రాన్స్ కు చెందిన సీఏసీ 0.38 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.30 శాతం నష్టంతో ముగిశాయి.
Oct 21 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో ఉన్నాయి. ఉదయం 7.40 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 4.25 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.78 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.33 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.31 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.17 శాతం లాభంతో ఉండగా.. చైనాకు చెందిన షాంఘై 0.05 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.33 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్లో నికరంగా రూ. 1,148 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు గత సెషన్లో నికరంగా రూ. 3,201 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు బలపడి 94.92 వద్ద ఉంది.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 110.02 డాలర్ల వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 101.79 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 5.13 శాతం వద్ద ఉంది.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.21 నుంచి 0.93 కి తగ్గింది.
- విక్స్ 5.33 శాతం పెరిగి 14.77 వద్ద ఉంది.