Nanded Tiruchanur Train | నాందేడ్​ – తిరుచానూరు రైలు క్రమబద్ధీకరణ

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nanded Tiruchanur Train | వేసవి సెలవుల నేపథ్యంలో పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలకు రద్దీ కొనసాగుతోంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. పెద్దపల్లి జంక్షన్ (Peddapalli Junction) మీదుగా నడుస్తున్న నాందేడ్ నుండి తిరుచానూరు (Tirupati) వీక్లీ స్పెషల్​ ట్రైన్ సర్వీస్​ను తాజాగా క్రమబద్దీకరించింది.

వీక్లీ ఎక్స్​ప్రెస్ నంబర్​ గతంలో 07015/16 ఉండగా.. క్రమబద్ధీకరణ తర్వాత ఈ రైలు సంఖ్య 17633/34 గా మారింది. ఈ రైలు మే 9 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 9న నాందేడ్ (Nanded Railway Station)​ నుంచి తిరుపతి వెళ్తుంది. 10న తిరుపతి నుంచి తిరుగు పయనం అవుతుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Nanded Tiruchanur Train | 16 బోగీలు

నాందేడ్– తిరుచానూరు వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలులో మొత్తం 16 బోగీలు ఉంటాయి. ఇందులో ఏసీ టైర్​–1 ఒకటి, టైర్​–2 ఒకటి, ఏసీ టైర్​–3 బోగీలు 4 ఉటాయి. స్లీపర్​ 6, జనరల్ బోగీలు 4 ఉంటాయి. ఈ రైలు బాసర, నిజామాబాద్​, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్​, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్​, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్​లలో ఆగుతుంది.

ఇది కూడా చదవండి : Mumbai Cocaine Seizure | ముంబైలో ఎన్సీబీ సంచలనం.. రూ.1,745 కోట్ల కొకైన్ సీజ్!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *