అక్షరటుడే, వెబ్‌డెస్క్: MVSR College Incident | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని నాదర్గుల్లో గల ఎంవీఎస్ఆర్ కాలేజీలో ఇటీవల దాండియా కార్యక్రమం నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. లైటింగ్ స్టాండ్ కూలిపోవడంతో ఓ విద్యార్థి చనిపోయింది. ఈ ఘటనలో పోలీసులు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు.
ఎంవీఎస్ఆర్ కాలేజీలో అక్టోబర్ 17న దండియా కార్యక్రమంలో ఇనుప ట్రస్ కూలిపోయి ఒక విద్యార్థి మరణించగా, మరో 22 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభింంచారు. ఈ మేరకు తాజాగా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈవెంట్ సిబ్బంది, కళాశాల కోఆర్డినేటర్లతో సహా మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. అరెస్టు అయిన వారిలో ఈవెంట్ ఆర్గనైజర్ మల్లేల సాకేత్ (22), పీఎస్-లైటింగ్స్ అండ్ సౌండ్స్‌కు చెందిన బతుల పునీత్ (21), సాయం నిశాంత్ యాదవ్ (24) ఉన్నారు.
MVSR College Incident | భద్రతా లోపాలు
ఈవెంట్ నిర్వహణలో భద్రతా లోపాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాకేత్ ‘క్రియా ఆపరేషన్స్’ పేరిట ఈవెంట్స్ నిర్వహిస్తూ. వేదిక, ట్రస్, సౌండ్ సిస్టమ్, జనరేటర్, లైటింగ్‌ను ఏర్పాటు చేసే బాధ్యతను తీసుకున్నాడు. ట్రస్‌ను నాలుగు స్తంభాలకు బదులుగా కేవలం రెండు స్తంభాలతోనే నిర్మించారు. దీంతోనే అది కూలిపోయి విద్యార్థులపై పడింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Gold Smuggling | బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు గోల్డ్ స్మగ్లింగ్.. ఐదుగురి అరెస్ట్