El Niño Farming Advisory | రైతులు వరిసాగుకు దూరంగా ఉండాలి

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరిసాగుకు దూరంగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి జి. వీరస్వామి సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: El Niño Farming Advisory | ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు (Farmers) వరిసాగుకు దూరంగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి జి. వీరస్వామి సూచించారు. వర్ని సీసీడీలో శుక్రవారం ఎల్‌నినో పరిస్థితులపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాజా గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

El Niño Farming Advisory | తగ్గిన నీటి లభ్యత

ఉష్ణోగ్రతలు పెరిగి, నీటి లభ్యత తగ్గే అవకాశం ఉన్నందున రైతులు నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి పేర్కొన్నారు. వరిసాగుకు బదులుగా తక్కువ నీటితో పండించే ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలను సాగు చేయాలన్నారు. ఒక ఎకరం వరి పంట సాగుకు సీజన్‌లో సుమారు 30 నుంచి 40 లక్షల లీటర్ల నీరు అవసరమవుతుందని తెలిపారు. ప్రస్తుతం భూగర్భ జలమట్టం సాధారణ సగటు కంటే తక్కువగా ఉండి, సుమారు 9 మీటర్ల లోతుకు పడిపోయిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నీటి కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

ముఖ్యంగా వరిపంటకు నీటికొరత ఏర్పడితే పంట ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాలువల ద్వారా కూడా అవసరమైన సమయంలో సాగునీటిని అందించడం కష్టతరమయ్యే అవకాశం ఉందని వివరించారు. వరిసాగుకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, జొన్న, శనగ, పొద్దుతిరుగుడు, పెసర, మినుము, కుసుమ, నువ్వులు వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.

ఇది కూడా చదవండి..: Ration Dealers | రేషన్​డీలర్ల సమస్యలు పరిష్కరించాలి..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *