Fauzi Prabhas Movie | ‘ఫౌజీ’ గ్లింప్స్ హంగామా.. బాక్సాఫీస్‌పై ఇక రెబల్ స్టార్ దండయాత్రేనా.. విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం!

విశాల్ చంద్రశేఖర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ వీడియోకు అతిపెద్ద అసెట్. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా తగ్గకుండా హాలీవుడ్ రేంజ్‌ విజువల్స్‌తో ఈ ప్రాజెక్ట్‌ను రూపుదిద్దుతోంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Fauzi Prabhas Movie | రెబల్ స్టార్ ప్రభాస్ Prabhas కథానాయకుడిగా.. టాలెంటెడ్ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం ‘ఫౌజీ’. తాజాగా చిత్ర బృందం ఈ మూవీకి సంబంధించిన అధికారిక టైటిల్, గ్లింప్స్, విడుదల తేదీని ప్రకటిస్తూ ఒక పవర్‌ఫుల్ వీడియోను రిలీజ్ చేసింది.

Fauzi Prabhas Movie | ఆ వీడియోలో ఏముందంటే..

“భారతీయుల రక్తంలో బానిసత్వం ఉంది” అన్న అడాల్ఫ్ హిట్లర్‌కు.. “బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఒకే ఒక్క యోధుడు ఉన్నాడు.. అతడే ‘ఫౌజీ’!” అని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చే సమాధానం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి చేర్చింది.

హిట్లర్ Vs నేతాజీ సంభాషణతో పవర్‌ఫుల్ స్టార్ట్! గ్లింప్స్ ప్రారంభంలోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్, అడాల్ఫ్ హిట్లర్ మధ్య జరిగే సంభాషణ సీన్ సినిమా రేంజ్‌ను పరిచయం చేసింది. రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి నేపథ్యంలో సాగే కథలో, బ్రిటిష్ వారిని ఓడించేందుకు సుభాష్ చంద్రబోస్ జర్మనీ మద్దతు కోరే ఘట్టాన్ని అత్యంత ఉత్కంఠభరితంగా ఆవిష్కరించారు.

హిట్లర్ వ్యాఖ్యలు: “ఇండియన్ల రక్తంలో బానిసత్వం నిండి ఉంది, యుద్ధం గెలవడం సాధ్యం కాదు.

“నేతాజీ కౌంటర్: “మా దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్, భగవద్గీత సూత్రాల ఆధారంగా శత్రువుల గుండెల్లో నిద్రపోయే ఒకే ఒక్క సైనికుడు ఉన్నాడు. జర్మనీ ‘ఎనిగ్మా’ కోడ్ కంటే అత్యంత ప్రమాదకరమైన ఆ వీరుడినే ప్రపంచం ‘ఫౌజీ’ అని పిలుస్తుంది!”

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

ఈ సంభాషణ అనంతరం రెబల్ స్టార్ ప్రభాస్ ఎంట్రీ ఇచ్చి బ్రిటిష్ అధికారులపై విరుచుకుపడే మాస్ సీన్లు, ఆ పవర్‌ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.

Fauzi Prabhas Movie | టెక్నికల్ వండర్ – హాలీవుడ్ రేంజ్ లో గ్రాండియర్

దర్శకుడు హను రాఘవపూడి తన మార్క్ ఎమోషన్స్‌తో పాటు భారీ విజువల్ కాన్వాస్‌ను సిద్ధం చేశారు. విశాల్ చంద్రశేఖర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ వీడియోకు అతిపెద్ద అసెట్. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా తగ్గకుండా హాలీవుడ్ రేంజ్‌ విజువల్స్‌తో ఈ ప్రాజెక్ట్‌ను రూపుదిద్దుతోంది.

Fauzi Prabhas Movie | థియేటర్ల మోత మార్చి 19న!

కేవలం గ్లింప్స్‌తోనే పాన్-ఇండియా వ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేసిన చిత్రబృందం, ఈ మూవీ ప్రపంచవ్యాప్త విడుదల తేదీని 2027 మార్చి 19గా ప్రకటించింది. భారత స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యంలో మరుగునపడిన ఒక విస్మృత వీరుడి గాథ ఆధారంగా వస్తున్న ఈ ‘ఫౌజీ’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని సినీ ప్రియులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *