Medical Prescription Guidelines | వైద్యులు అర్థమయ్యే రీతిలో ప్రిస్క్రిప్షన్ రాయాలి : జిల్లా జడ్జి

వైద్యులు అర్థమయ్యే రీతిలో ప్రిస్క్రిప్షన్ రాయాలని నిజామాబాద్​ జిల్లా జడ్జి భరతలక్ష్మి పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Medical Prescription Guidelines | వైద్యులు అందరికి అర్థమయ్యే రీతిలో ప్రిస్క్రిప్షన్ రాయాలని జిల్లా (Nizamabad) జడ్జి భరతలక్ష్మి పేర్కొన్నారు. కలెక్టరేట్​లో శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులకు, వైద్య రంగ నిపుణులకు వివిధ అంశాలపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.

Medical Prescription Guidelines | వైద్యుల హక్కులు.. వైద్యసేవల్లో..

వైద్య సేవలందించే సమయంలో చట్టపరమైన నిబంధనలను పాటించడం, వైద్య రికార్డులను సక్రమంగా నిర్వహించడంపై జిల్లా న్యాయమూర్తి వివరించారు. వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడం ద్వారా వైద్యులు, రోగుల హక్కులను పరిరక్షించడంతో పాటు న్యాయ ప్రక్రియకు సహకారం అందించిన వారు అవుతారని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో వైద్యులు భాగస్వాములుగా వ్యవహరించాల్సిన ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి నారాయణ, నాల్గో అదనపు జిల్లా న్యాయమూర్తి డి.దుర్గాప్రసాద్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నీలిమ ముద్దసాని, ట్రైనీ కలెక్టర్ సురేష్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్.సుభాష్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి రాజశ్రీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షుడు విశాల్, డీసీహెచ్ఎస్ శ్రీనివాస్ ప్రసాద్, రాష్ట్ర వైద్య మండలి ఇన్‌చార్జి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ రాథోడ్, రాజ్ కుమార్ సుబేదార్  పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: అక్రమ బోర్‌వెల్స్‌పై HYDRAA చర్యలు.. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *