అక్షరటుడే, వెబ్‌డెస్క్: Balakonda suicide attempt | ప్రేమ పేరుతో ఒకడు నమ్మించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నట్టేట ముంచాడు.. దీంతో న్యాయం చేయమని పోలీసులను ఆశ్రయించింది. ఆపై ఆవేదనను తట్టుకోలేక ఓ యువతి ప్రాణాలు తీసుకునేందుకు సిద్దమైంది.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని పాత పోలీస్ స్టేషన్ (ప్రస్తుత ముప్కాల్ పీఎస్) భవనంపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Balakonda suicide attempt | అసలేం జరిగింది
బాల్కొండకు చెందిన యువతి (20) అదే గ్రామానికి చెందిన బాసెట్టి సాయికుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. సాయికుమార్ అప్పటికే వివాహితుడైనప్పటికీ, ఆ విషయాన్ని దాచిపెట్టి బాధిత యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కొంతకాలం తర్వాత అతని అసలు స్వరూపం బయటపడటంతో తాను మోసపోయానని గ్రహించిన అమ్మాయి తీవ్ర మనస్తాపానికి గురైంది.
Balakonda suicide attempt | పోలీస్ స్టేషన్‌లోనే..
తనను మోసం చేసిన సాయికుమార్‌పై ఫిర్యాదు చేసేందుకు బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. అయితే, తన జీవితం నాశనమైందన్న ఆవేదనలో ఉన్న ఆమె.. అక్కడే ఉన్న పాత పోలీస్ స్టేషన్ భవనం పైకి చేరుకుని కిందకు దూకేసింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో అక్కడున్న వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు.
Balakonda suicide attempt | ఆసుపత్రిలో చికిత్స
భవనం పైనుంచి దూకడంతో యువతి నడుము భాగంలో తీవ్రమైన గాయాలయ్యాయి. స్పందించిన పోలీసులు, స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది.
“నమ్మి వచ్చిన అమ్మాయిని మోసం చేయడమే కాకుండా, ఆమె ప్రాణాలు తీసుకునే పరిస్థితికి తెచ్చిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి..” అని బాధితురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Health Ticket Bus | శారీరక శ్రమతోనే ప్రయాణం.. 20 బస్కీలు తీస్తే బస్సు టికెట్ ఉచితం!

