అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RTC Weekly Pass | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ప్రయాణికులకు ఆర్టీసీ (RTC) గుడ్ న్యూస్ చెప్పింది. రూ.600లకే వారం రోజుల పాస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు అధికారులు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్ సిటీ బస్సుల్లో (City Buses) ప్రయాణించే వారి కోసం కొత్త పథకానికి ఆర్టీసీ ఆదివారం శ్రీకారం చుట్టింది. రూ.600లకే వీక్లీ పాస్ తీసుకొచ్చింది. ఈ పాస్ తీసుకుంటే హైదరాబద్ నగరం (క్యూర్) పరిధిలో ఏసీ బస్సులతో సహా అన్ని బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. వారం రోజుల పాటు అపరిమితంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. ప్రయాణికులు సులభంగా, బడ్జెట్ ఫ్రెండ్లీ సిటీ బస్సు ప్రయాణం కోసం దీనిని తీసుకొచ్చినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
RTC Weekly Pass | సిటీ బస్ సెంటర్లలో..
ఈ పాస్ కొనుగోలు చేసిన రోజు నుంచి వరుసగా ఏడు రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. పుష్పక్ ఎయిర్పోర్ట్ (Pushpak Airport) సర్వీసులు మినహా మిగతా అన్ని రకాల సిటీ బస్సుల్లో ఈ పాస్‌తో ఉచితంగా ప్రయాణించొచ్చు. నగరంలోని అన్ని సిటీ బస్ పాస్ కౌంటర్లలో ఈ బస్‌పాస్‌లు అందుబాటులో ఉంటాయి. రోజువారీ ప్రయాణికులు, పర్యాటకులు, వ్యాపార నిమిత్తం నగరానికి వచ్చేవారికి ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. సిటీ బస్సుల్లో ఇప్పటికే డెయిలీ, మంత్లీ పాస్‌లు అందుబాటులో ఉండగా.. తాజాగా వీక్లీ పాస్‌ను ఆర్టీసీ తీసుకొచ్చింది.
దీనిని కూడా చదవండి : Ramanthapur Blast | స్క్రాప్ దుకాణంలో పేలుడు.. ఒకరికి తీవ్రగాయాలు