అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump Iran Remarks | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంలో ప్రస్తుతం నాయకులు ఎవరూ లేరని, ఎవరితో చర్చలు జరపాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నానని పేర్కొన్నారు.
అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ తన ప్రసంగాల్లో ఇరాన్‌పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం మాట్లాడుతూ.. వారి దగ్గర విమానాలు లేవు, నౌకలు లేవు, నాయకులు లేరు, ఏమీ లేవని టెహ్రాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. వారి మొదటి స్థాయి నాయకుడు లేడు, రెండో స్థాయి నాయకుడు కూడా లేడు… అసలు తాను ఎవరితో చర్చలు జరపాలో అర్థం చేసుకోవాల్సి ఉందని వ్యంగ్యంగా అన్నారు.
Trump Iran Remarks | ఎన్నికల తర్వాత..
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ (Iran)లోని కీలక నేతలు హతం అయ్యారు. ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సైతం మరణించారు. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ దాడులను తాత్కాలికంగా నిలిపివేశాయి. నవంబర్ 3న జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత దాడులు మళ్లీ మొదలవుతాయని ట్రంప్ సంకేతాలు ఇస్తున్నారు. మరోవైపు ఇరాన్ సైతం ప్రతిదాడులకు సిద్ధం అవుతోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి మాట్లాడుతూ, యుద్ధం మళ్లీ మొదలైనా తమ దేశ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.
దీనిని కూడా చదవండి : Kharge Modi Controversy | మోదీ తండ్రి కూడా దిగిపోవాల్సిందే.. ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు