అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyundai Bayon SUV | భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త సంచలనానికి తెరతీస్తూ ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా’ తమ అత్యాధునిక ఎస్‌యూవీ ‘హ్యుందాయ్ బాయోన్’ (Hyundai Bayon) ను అధికారికంగా ఆవిష్కరించింది. “ఇంటెలిజెన్స్ దట్ మూవ్స్” అనే ప్రధాన నినాదంతో తీర్చిదిద్దిన ఈ ఇంటెలిజెంట్ యుటిలిటీ వెహికల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 9,99,900 గా నిర్ణయించారు. మన దేశంలోనే ‘మేడ్ ఇన్ ఇండియా’ ప్రాజెక్ట్ కింద తయారవుతున్న ఈ వాహనం, ఇక్కడి మార్కెట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాలకు ఎగుమతి కానుంది.
Hyundai Bayon SUV | ఏఐ వాయిస్ అసిస్టెంట్..
హ్యుందాయ్ చరిత్రలోనే మొదటిసారిగా ఈ కారులో జనరేటివ్ ఏఐ వాయిస్ అసిస్టెంట్ ను ప్రవేశపెట్టారు. ‘పర్పెలెక్సిటీ’ , ‘సౌండ్‌హౌండ్ ఏఐ’ టెక్నాలజీల ఆధారంగా పనిచేసే ఈ ఫీచర్ ద్వారా వాహనంతో చాలా సహజంగా మాట్లాడవచ్చు. ప్రయాణ ప్రణాళికలు, వాతావరణ సమాచారం, రెస్టారెంట్లు, వార్తలు , క్రీడల వివరాలను ఇది తక్షణమే అందిస్తుంది.
కర్వ్‌డ్ పనోరమిక్ డిస్‌ప్లే..
ఎన్‌విడియా (NVIDIA) భాగస్వామ్యంతో రూపొందించిన కనెక్టెడ్ కార్ నావిగేషన్ కాక్‌పిట్ (ccNC) ఈ కారు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులో 12.3 అంగుళాల చొప్పున ఉన్న రెండు కర్వ్‌డ్ పనోరమిక్ డిస్‌ప్లేలు, 70కి పైగా బ్లూలింక్ కనెక్టెడ్ ఫీచర్లు, 500 కంటే ఎక్కువ వాయిస్ కమాండ్‌లు , ఓవర్-ది-ఎయిర్ (C-OTA) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సదుపాయం ఉన్నాయి. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో పాటు బోస్ (Bose) ప్రీమియం సౌండ్ సిస్టమ్‌ను కూడా పొందుపరిచారు.
Hyundai Bayon SUV | భారతీయ 5-స్టార్ సేఫ్టీ ..
గ్లోబల్ కే (Global K) ఎన్‌హాన్స్డ్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన ఈ కారును భారతీయ 5-స్టార్ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. దీని బాడీ నిర్మాణంలో 69 శాతం మేర అత్యంత పటిష్టమైన అడ్వాన్స్‌డ్ హై-స్ట్రెంగ్త్ స్టీల్‌ను ఉపయోగించారు. ఇందులో 23 అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లతో కూడిన హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ లెవెల్ 2 ప్రో ఏడాస్ (ADAS) అమర్చారు. అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, అన్ని చక్రాలకు డిస్క్ బ్రేక్‌ల వంటి 35కి పైగా ప్రామాణిక భద్రతా ఫీచర్లు లభిస్తాయి.
విశాలమైన క్యాబిన్..
2,600 మిమీ వీల్‌బేస్‌తో రూపొందించిన ఈ ఎస్‌యూవీలో ప్రయాణికులకు తగినంత లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ లభిస్తాయి. ముందు వరుసలో వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రిక్ 8-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ , వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి హంగులు ఉన్నాయి. కుటుంబ ప్రయాణాలకు అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా 505 లీటర్ల విశాలమైన బూట్ స్పేస్ ను కేటాయించారు.
Hyundai Bayon SUV | డ్రైవింగ్ మోడ్‌లు..
నమ్మకమైన 1.5 లీటర్ MPi 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్న ఈ కారు 115 PS పవర్, 143.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ , ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (iVT) ఆప్షన్లలో లభిస్తుంది. ఐవిటి వెర్షన్‌లో ఓవర్‌టేక్ చేయడానికి తక్షణ శక్తినిచ్చే ‘డాష్ బూస్ట్ మోడ్’, స్పోర్టీ డ్రైవ్ టెక్ , విభిన్న డ్రైవ్ మోడ్‌లు (ఎకో, నార్మల్, స్పోర్ట్) లభిస్తాయి.
మోడరన్ డిజైన్ ..
ముందు భాగంలో హెచ్-ఎడ్జ్ ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, డ్యూయల్ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ ల్యాంప్స్ , వెనుక భాగంలో హెచ్-ఎడ్జ్ టెయిల్ ల్యాంప్స్‌తో బాయోన్ ఎస్‌యూవీ అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 17 అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వీల్స్, 205 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు లోపల డ్యూయల్ టోన్ ఇంటీరియర్ థీమ్, డి-కట్ స్టీరింగ్ వీల్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఈ కార్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.
ఇది కూడా చదవండి: Indiramma Houses | త్వరలో ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ బిల్లులు : మంత్రి పొంగులేటి