Durgam Cheruvu | దుర్గం చెరువులో దూకి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

మాదాపూర్​లోని దుర్గం చెరువులో దూకి ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Durgam Cheruvu | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని మాదాపూర్​లో విషాదం చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఏపీలోని విశాఖపట్నంకు చెందిన రాజేశ్​ (25) నగరంలో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​గా పని చేస్తున్నాడు. నాచారంలోని ఓ హాస్టల్​లో ఉంటూ ఉద్యోగానికి వెళ్తున్నాడు. అయితే మాదాపూర్​లోని అయ్యప్ప సొసైటీలో అతడి స్నేహితులు ఉంటున్నారు. వారిని కలిసేందుకు రాజేశ్​ సోమవారం వచ్చాడు.

Durgam Cheruvu | కేబుల్​ బ్రిడ్జి సందర్శనకు వెళ్లి..

ఉదయం తన స్నేహితులతో కలిసి దుర్గం చెరువు దగ్గరకు రాజేశ్ వెళ్లాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో స్నేహితులతో గొడవ జరిగినట్లు సమాచారం. అనంతరం అతడు కనిపించకుండా పోయాడు. అతడు దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..: Hyderabad Loud Sounds | హైదరాబాద్‌లో భారీ శబ్దాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *