Balkonda Development | బాల్కొండ అభివృద్ధికి సీతక్క భరోసా!

బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్‌గల్: Balkonda Development | బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి ముత్యాల సునీల్‌ కుమార్‌ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

Balkonda Development | మార్కండేయ మందిర పునర్నిర్మాణానికి..

మోర్తాడ్‌ ప్రజాభవనం ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి సీతక్క (Minister Seethakka)కు ముత్యాల సునీల్‌ కుమార్‌, కాంగ్రెస్‌ నాయకులు స్వాగతం పలికారు. బాల్కొండ మండల కేంద్రంలోని పురాతన మార్కండేయ మందిర పునర్నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు కేటాయించాలని పద్మశాలి సంఘం ప్రతినిధులు కోరారు. ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని దేవాదాయ శాఖ కమిషనర్‌కు మంత్రి సూచించారు.  నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, పెండింగ్‌లో ఉన్న పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సునీల్‌ కుమార్‌ వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి పనులను వేగవంతం చేయాలని సూచించారు.

Balkonda Development | ఇందిరమ్మ కాలనీ సమస్యలపై ఆరా

వేల్పూర్‌ మండలంలోని ఇందిరమ్మ కాలనీని మంత్రి సీతక్క సందర్శించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీసీ రహదారులు, మురుగునీటి కాల్వలు, విద్యుత్తు సౌకర్యాలపై ఆరా తీశారు. సంబంధిత శాఖల అధికారులు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాల్కొండ నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షుడు అందె వెంకటగిరి, కోశాధికారి కుందారపు శ్రీనివాస్‌ తదితరులు మంత్రిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు భూస రత్నాకర్‌, మామిడాల రాజు, తాటికొండ నరేందర్‌, బోగ గంగ కిషన్‌, తౌట్‌ కోటేశ్వర్‌, ఏలిగేటి ఆనంద్‌, ఎక్కలదేవి సురేష్‌, భూస శ్రీహరి, మాజీ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ నర్సయ్య, మండల ఫోరం అధ్యక్షుడు అరిగెల జనార్ధన్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Madhav Nagar ROB Protest | మాధవనగర్‌ ఆర్వోబీ వద్ద బీజేపీ నిరసన దీక్ష.. తరలివచ్చిన శ్రేణులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *