అక్షరటుడే, వెబ్‌డెస్క్: Arnab Cyclone | అర్నబ్ తుపాన్ ఎఫెక్ట్‌తో సముద్రం అల్లాకల్లోలంగా మారింది. అలలు విరుచుకుపడుతున్నాయి. దీంతో తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విశాఖపట్నం పోలీసులు ప్రజలను తీర ప్రాంతం నుండి ఖాళీ చేయాలని అనౌన్స్ చేస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను నేటి సాయంత్రం వరకు పశ్చిమ-వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉంది. అనంతరం ఇది వాయవ్య దిశగా కదులుతూ బుధవారం ఉదయానికి బాపట్ల, విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు 125-135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
Arnab Cyclone | ప్రభుత్వం అప్రమత్తం
తుపాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం (AP Government) అప్రమత్తం అయింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరింది. ఈ తుపానుతో పాటు బలమైన గాలులు, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సైక్లోన్ తీరాన్ని దాటే సమయంలో సముద్ర పరిస్థితులు అసాధారణంగానే ఉండే అవకాశం ఉంది. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు అత్యవసర సహాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏపీఎస్డీఎంఏ) రాష్ట్ర, జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. అత్యవసర సహాయం కోసం 112, రాష్ట్ర విపత్తు నిర్వహణ కంట్రోల్ రూమ్ నంబర్ 1070, విపత్తు నిర్వహణ హెల్ప్‌లైన్ 1800 425 0101, మన మిత్ర వాట్సాప్ సేవ 9552300009 నంబర్ల ద్వారా ప్రజలు సమాచారం పొందొచ్చని తెలిపింది.
ఇది కూడా చదవండి..: Arnab Cyclone | దూసుకొస్తున్న తుపాన్ ముప్పు.. రేపు తీరం దాటనున్న ‘అర్నబ్’