అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ లాభనష్టాల మధ్య ఊగిసలాడింది. కనిష్టాల వద్ద కొనుగోళ్లతో మద్దతుగా నిలిచిన మదుపరులు.. గరిష్టాల వద్ద లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 116 డాలర్లు దాటడంతో గ్లోబల్ మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి. దీంతో మన మార్కెట్లు సైతం ఒత్తిడికి గురయ్యాయి.
Stock Market | నష్టాలతో ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) మంగళవారం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 122 పాయింట్ల గ్యాప్ డౌన్‌లో ప్రారంభమై మరో 274 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 55 పాయింట్లు నష్టపోయింది. ఇంట్రాడేలో సూచీలు ఒడిదుడుకులకు లోనవుతూ లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. చివరికి సెన్సెక్స్ 8 పాయింట్ల నష్టంతో 73,598 వద్ద, నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో 22,749 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market | బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్‌లో అమ్మకాలు..
దేశీయ స్టాక్ మార్కెట్‌లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. బ్యాంక్ నిఫ్టీ 0.72 శాతం, ఫైనాన్షియల్ ఇండెక్స్ 0.49 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఒక దశలో 2 శాతానికిపైగా పడిపోయినా.. తర్వాత కోలుకుని 0.26 శాతం నష్టంతో ముగిసింది. ఫార్మా, పవర్, ఆటో సెక్టార్లలో కొనుగోళ్ల మద్దతు కనిపించింది.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,946 కంపెనీలు లాభపడగా 1,370 స్టాక్స్ నష్టపోయాయి. 231 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 70 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 198 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 18 కంపెనీలు లాభాలతో, 12 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎయిర్‌టెల్ 3.18 శాతం, ట్రెంట్ 2.40 శాతం, మారుతి 2.28 శాతం, పవర్‌గ్రిడ్ 1.99 శాతం, ఎటర్నల్ 1.66 శాతం లాభపడ్డాయి.
Top Losers : ఎస్బీఐ 1.55 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.53 శాతం, టీసీఎస్ 1.42 శాతం, ఆసియన్ పెయింట్ 1.40 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.19 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Indian Stock Market | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. ఫ్లాట్‌గా సూచీలు