Preventive Arrests | బాన్సువాడలో ఏనుగు వర్గీయుల ముందస్తు అరెస్టులు

మంత్రి సీతక్క పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Preventive Arrests | మండలంలో మంగళవారం మంత్రి సీతక్క (Minister Seethakka) పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నేపథ్యంలో ఏనుగు రవీందర్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. వివిధ గ్రామాలు, మండల కేంద్రాల్లో నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గం, ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అరెస్టులు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

Preventive Arrests | మంత్రికి స్వాగతం పలకడానికి సిద్ధమైతే అరెస్టులా?

దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని బాన్సువాడలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన తమను, తమ పార్టీ మంత్రి వస్తే అరెస్ట్​ చేయడం ఎంతవరకు సమంజసమని ఏనుగు వర్గం కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. మంత్రి సీతక్క అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు వస్తుండటంతో ఆమెకు స్వాగతం పలకడానికి సిద్ధమవుతుండగా, పోలీసులు ఉదయాన్నే తమ ఇళ్లకు వచ్చి అదుపులోకి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రిని ఎప్పుడూ అడ్డుకోలేదని, అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలిగించే ఉద్దేశం తమకు లేదని నాయకులు పేర్కొన్నారు. అయినప్పటికీ ముందస్తు అరెస్టులు చేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న తమ పట్ల ఇలాంటి చర్యలు తీసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి..: Municipal Corruption | ప్రతి పనికి డబ్బులు అడుగుతున్నారు.. బల్దియా ఎదుట ప్రజల ఆందోళన

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *