Illegal Water Business | అక్రమ నీటిదందాపై ఉక్కుపాదం.. మరో 7 బోర్లు సీజ్​

హైదరాబాద్​ నగరంలో అక్రమ నీటిదందాపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Illegal Water Business | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో అక్రమ నీటిదందాపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. చెరువుల సమీపంలో బోర్లు వేసి, ట్యాంకర్ల ద్వారా నీటిని విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు చేపడుతుంది.

హైడ్రా (Hydraa) అధికారులు శనివారం సున్నం చెరువు పరిధిలో దాడులు చేపట్టి పలు బోర్లను తొలగించారు. సోమవారం మరోసారి సున్నం చెరువుతో పాటు తుమ్మిడికుంట పరిధిలో దాడులు చేసి బోర్లను సీజ్​ చేశారు. తాజాగా మంగళవారం జీడిమెట్ల ప్రాంతంలోని ఫాక్స్ సాగ‌ర్ దిగువున హైడ్రా భారీ ఆప‌రేష‌న్ నిర్వ‌హించింది. కొంప‌ల్లి శివారులో చెరువుకు ఆనుకుని బోర్లు వేసి కొందరు నీటి దందా చేస్తున్నారు. అధికారులు 7 బోర్ల‌ను పైపుల‌తో స‌హా పెకిలించి నీటి దందాను నిలిపేసింది.

Illegal Water Business | జలమండలి పేరుతో..

అక్రమార్కులు చెరువు సమీపంలో బోర్లు వేశారు. అంతేగాకుండా ట్యాంకర్లకు జలమండలి (HMWSSB) స్టిక్కర్లు అతికించారు. జ‌ల‌మండ‌లి పేరుతో వ్యాపారం చేస్తున్నారు. పెద్ద షెడ్డులు వేసి బోర్ల నుంచి ప్లాస్టిక్​ ట్యాంకుల్లో నీటిని నింపుతున్నారు. అనంతరం వాటి నుంచి ట్యాంకర్లలో నింపి ప్రజలకు సరఫరా చేస్తున్నారు. అధికారులు అక్రమ బోర్లను, పైప్​లైన్​లను తొలగించారు.

దీనిని కూడా చదవండి : E-Cigarette Seized | మైనర్లకు ఇ–సిగరెట్ల విక్రయం.. ఈగల్​ ఫోర్స్​ దాడులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *