అక్షరటుడే, వెబ్డెస్క్ : Illegal Water Business | హైదరాబాద్ (Hyderabad) నగరంలో అక్రమ నీటిదందాపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. చెరువుల సమీపంలో బోర్లు వేసి, ట్యాంకర్ల ద్వారా నీటిని విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు చేపడుతుంది.
హైడ్రా (Hydraa) అధికారులు శనివారం సున్నం చెరువు పరిధిలో దాడులు చేపట్టి పలు బోర్లను తొలగించారు. సోమవారం మరోసారి సున్నం చెరువుతో పాటు తుమ్మిడికుంట పరిధిలో దాడులు చేసి బోర్లను సీజ్ చేశారు. తాజాగా మంగళవారం జీడిమెట్ల ప్రాంతంలోని ఫాక్స్ సాగర్ దిగువున హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. కొంపల్లి శివారులో చెరువుకు ఆనుకుని బోర్లు వేసి కొందరు నీటి దందా చేస్తున్నారు. అధికారులు 7 బోర్లను పైపులతో సహా పెకిలించి నీటి దందాను నిలిపేసింది.
Illegal Water Business | జలమండలి పేరుతో..
అక్రమార్కులు చెరువు సమీపంలో బోర్లు వేశారు. అంతేగాకుండా ట్యాంకర్లకు జలమండలి (HMWSSB) స్టిక్కర్లు అతికించారు. జలమండలి పేరుతో వ్యాపారం చేస్తున్నారు. పెద్ద షెడ్డులు వేసి బోర్ల నుంచి ప్లాస్టిక్ ట్యాంకుల్లో నీటిని నింపుతున్నారు. అనంతరం వాటి నుంచి ట్యాంకర్లలో నింపి ప్రజలకు సరఫరా చేస్తున్నారు. అధికారులు అక్రమ బోర్లను, పైప్లైన్లను తొలగించారు.
దీనిని కూడా చదవండి : E-Cigarette Seized | మైనర్లకు ఇ–సిగరెట్ల విక్రయం.. ఈగల్ ఫోర్స్ దాడులు