Jio Platforms Listing | స్టాక్ మార్కెట్‌లో రెండో అతిపెద్ద కంపెనీ!.. జియో ప్లాట్‌ఫామ్స్ లిస్టింగ్‌పై భారీ అంచనాలు

భారీ అంచనాలతో వస్తున్న జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు బుధవారం స్టాక్ మార్కెట్ లో లిస్టవనున్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jio Platforms Listing | రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికాం, డిజిటల్ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్(Jio Platforms) లిమిటెడ్ స్టాక్ మార్కెట్ లో చరిత్ర సృష్టించేందుకు రెడీ అయ్యింది. ఈ కంపెనీ షేర్లు బుధవారం(అక్టోబరు 28న) ఉదయం 10 గంటలకు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానున్నాయి. భారీ ఐపీవో కావడం, సుమారు రెండు దశాబ్దాల తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) నుంచి వస్తున్న పబ్లిక్ ఇష్యూ కావడంతో దీనిపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.

Jio Platforms Listing | తొలి కంపెనీ..

జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ఐపీవో (IPO) అప్పర్ ప్రైస్ బ్యాండ్ రూ. 1,119. ఈ ధర వద్ద కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10.3 లక్షల కోట్లుగా ఉంది. తద్వారా దేశంలో రూ.10 లక్షల కోట్ల మార్కెట్ విలువతో వస్తున్న తొలి కంపెనీగా జియో రికార్డులకెక్కనుంది.

Jio Platforms Listing | టాప్ -4లో ఒకటిగా..

ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్‌లో మార్కెట్ విలువ ఆధారంగా టాప్ త్రీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ , ఎయిర్‌టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ సుమారు రూ.16.2 లక్షల కోట్లు కాగా.. ఎయిర్‌టెల్ విలువ రూ.12.2 లక్షల కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలువ రూ.10.6 లక్షల కోట్లుగా ఉంది. అప్పర్ ప్రైస్ బ్యాండ్ అయిన రూ. 1,119 వద్ద కంపెనీ షేర్లు లిస్టయినా మార్కెట్ విలువ రూ. 10.3 లక్షల కోట్లుగా ఉండనుంది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్‌లో నాలుగో అతిపెద్ద కంపెనీగా జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ నిలిచే అవకాశాలున్నాయి.

Jio Platforms Listing | జీఎంపీ ప్రకారం రెండో అతిపెద్ద కంపెనీ..

జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు గ్రే మార్కెట్‌లో 22 శాతం ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయి. ఈ లెక్కన రూ. 1,367 వద్ద లిస్టయ్యే అవకాశం ఉంది. జీఎంపీ సూచించిన ప్రీమియంతో లిస్టయితే కంపెనీ మార్కెట్ విలువ రూ. 12.5 లక్షల కోట్లకు చేరుతుంది. తద్వారా మార్కెట్ విలువ పరంగా దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా జియో ప్లాట్‌ఫామ్స్ అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి..: Jio Platforms IPO | చరిత్ర సృష్టించిన జియో ప్లాట్‌ఫామ్స్.. రెండో అతిపెద్ద కంపెనీగా ఆవిర్భావం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *