అక్షరటుడే, ఎల్లారెడ్డి: Manjeera River Deaths | మంజీర నదిలో గల్లంతైన తల్లీకూతుళ్ల ఘటన చివరకు విషాదాంతమైంది. ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు మెదక్ జిల్లా మంజీర నదిలో దూకి చనిపోయారు.
Manjeera River Deaths | మల్కాపూర్‌కు చెంది…
మెదక్ జిల్లా (Medak district) కొల్చారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన సరిత (30) హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డులో పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు వైష్ణవి (8), సంగిక (6) ఉన్నారు. ఆధార్‌లో మార్పులు చేయించుకునేందుకు ఆమె తన ఇద్దరు కుమార్తెలతో మల్కాపూర్‌కు వచ్చింది. కాని ఏం జరిగిందో తెలయదు కాని.. 26వ తేదీన ఇంట్లో నుంచి ఆమె తన ఇద్దరు పిల్లలతో అదృశ్యమైంది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఆమె మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న ఘనపూర్ శివారులోని ఏడుపాయల మొదటి వంతెన సమీపంలో నదిలోకి పిల్లలతో దూకినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఆమె సెల్‌ఫోన్, చెప్పులను పోలీసులు గుర్తించారు. అప్పటికే తాను పిల్లలతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుటుంబీలకు ఫోన్లో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇద్దరు చిన్నారుల్లో వైష్ణవి ఐదో తరగతి, సంగిక నాలుగో తరగతి చదువుతున్నారు. తల్లి, ఇద్దరు కూతుళ్ల మృతితో మల్కాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది.
ఇది కూడా చదవండి..: Gandhari Woman Death | గేదె విషయంలో గొడవ.. ఆపేందుకు వెళ్లిన మహిళ మృతి