Bodhan Market Committee | బోధన్​ మార్కెట్ కమిటీ ఛైర్మన్​గా నాగేశ్వర రావు ప్రమాణస్వీకారం

బోధన్​ మార్కెట్ కమిటీ ఛైర్మన్​గా నాగేశ్వర రావు ప్రమాణస్వీకారం చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్ : Bodhan Market Committee | బోధన్​ మార్కెట్ కమిటీ ఛైర్మన్​గా నాగేశ్వర రావు ప్రమాణస్వీకారం చేశారు. ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి (MLA Sudarshan Reddy) సమక్షంలో ఆయన పదవీబాధ్యతలు స్వీకరించారు.

Bodhan Market Committee | పెంటాకుర్దు గ్రామానికి చెందిన..

పెంటాకుర్దు గ్రామానికి చెందిన నాగేశ్వరరావు మార్కెట్​ కమిటీ నూతన ఛైర్మన్​గా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సుదర్శన్​ రెడ్డి మాట్లాడుతూ.. ఎల్​నినో ప్రభావం ఉన్నందున రైతులు ఆరుతడి పంటలనే సాగు చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో ఎల్​నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. తాగడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితులు వచ్చే అవకాశాలున్నాయని.. కాబట్టి రైతులు వరిసాగు చేయవద్దని సూచించారు. కొన్నినెలల వరకు విద్యుత్​ను పొదుపుగా వాడుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్, డీసీసీ డెలిగేట్​ గంగాశంకర్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Bhupathi Reddy Arvind Remarks | ఎంపీ అర్వింద్​ భిక్షాటన మోదీ ఇంటి ముందు చేస్తే బాగుండేది..: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *