Jio Platforms Listing | వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ.. ఎందుకో తెలుసా?

రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ (Jio Platforms) స్టాక్ మార్కెట్ అరంగేట్ర వేడుక ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) వేదికగా అట్టహాసంగా జరిగింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Jio Platforms Listing | రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ (Jio Platforms) స్టాక్ మార్కెట్ అరంగేట్ర వేడుక ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) వేదికగా అట్టహాసంగా జరిగింది. అంబానీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో జియో షేర్లు మార్కెట్‌లో బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చాయి. అయితే, ఈ లిస్టింగ్ వేడుకలో వ్యాపార విజయంతో పాటు అంబానీ కుటుంబ సభ్యుల మధ్య కనిపించిన ఒక భావోద్వేగ సన్నివేశం అందరినీ కదిలించింది. వేదికపై తన పిల్లల ప్రసంగాలు వింటూ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆనందబాష్పాలు రాల్చారు.

Jio Platforms Listing | అనంత్ అంబానీ ప్రసంగం..

రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ మాట్లాడుతూ జియో కేవలం ఒక కార్పొరేట్ సంస్థ కాదని, దేశ ప్రజలందరి ఆశీస్సులతో నిర్మితమైన ఒక అద్భుతమని కొనియాడారు. “జియోను ఈ దేశం మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. అమ్మేమో ‘జియో మేరే లాల్’ అని ప్రేమగా దీవిస్తే, నాన్నమ్మ ‘జుగ్ జుగ్ జియో’ అంది, స్నేహితులేమో ‘జియో యార్’ అని ఆప్యాయంగా పిలుచుకున్నారు” అని పేర్కొన్నారు. “నేను, ఆకాష్, ఇషా.. ముగ్గురం వేర్వేరు శరీరాలైనా ఒకే ఆత్మగా పనిచేస్తాం. ప్రతి భారతీయుడి కలలను నెరవేర్చడమే మా ఏకైక లక్ష్యం” అని అనంత్ ఉద్వేగంగా చెప్పారు. కొడుకు నోటి వెంట వచ్చిన ఈ మాటలను వింటూ వేదికపై ఉన్న తండ్రి ముఖేష్ అంబానీ తీవ్ర భావోద్వేగానికి లోనై, తన కళ్లద్దాలు తీసి కన్నీళ్లు తుడుచుకున్నారు.

Jio Platforms Listing | కొనియాడిన ఇషా అంబానీ..

అనంతరం నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ తన తండ్రి ముఖేష్ అంబానీ దార్శనికతను, నాయకత్వ పటిమను ప్రశంసించారు. ఇతరులు అసలు ఊహించలేని భవిష్యత్తును తన తండ్రి ముందే ఊహించారని, ఎవరైనా ‘అసాధ్యం’ అన్న పనిని ఆయన సుసాధ్యం చేసి చూపించారని కొనియాడారు. అలాగే, గత 13 ఏళ్లుగా జియో ప్రస్థానంలో అహర్నిశలు శ్రమించిన తన సోదరుడు ఆకాష్ అంబానీని ఆమె ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

Jio Platforms Listing | దేశంలోనే రెండో స్థానం..

ఒక సాధారణ టెలికాం ఆపరేటర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన జియో, నేడు సుమారు రూ. 12.6 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో భారతదేశంలోనే రెండవ అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. స్టాక్ మార్కెట్‌లో 20 శాతం లాభంతో ఘనంగా లిస్ట్ అయిన ఈ క్షణం.. తండ్రి కన్న కలలను పిల్లలు విజయవంతంగా నెరవేర్చిన అద్భుత ఘట్టంగా నిలిచింది.


ఇది కూడా చదవండి:  Bhupathi Reddy Arvind Remarks | ఎంపీ అర్వింద్ ప్రధాని​ మోదీ ఇంటి ముందు భిక్షాటన చేస్తే బాగుండేది : ఎమ్మెల్యే భూపతిరెడ్డి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *