అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: Farmers Awareness | సాగుభూమి సంరక్షణపై ముస్తాబాద్ మండలంలోని రైతు వేదికలో రైతులకు అవగాహన కల్పించారు. సాగునీటి లభ్యత, ఎల్‌నినో ప్రభావంపై మండల స్పెషల్ ఆఫీసర్ నిర్మల సూచనలు అందజేశారు.
Farmers Awareness | క్రాప్ హాలిడే ప్రకటించాలి
ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని, ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు (Farmers) అధిక నీటి అవసరం ఉన్న పంటల సాగుపై పునరాలోచన చేయాలని నిర్మల సూచించారు. నీటి వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా సాగు విరామం (క్రాప్ హాలిడే) పాటించే అంశాన్ని పరిశీలించాలని, తద్వారా పెట్టుబడులు పెట్టి నష్టపోయే ప్రమాదాన్ని తగ్గించుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, స్వల్పకాలిక పంటల సూచించారు. ఈ కార్యక్రమం లో ముస్తాబాద్ తహశీల్దార్ అబ్దుల్ ఫారూఖ్, మండల వ్యవసాయ అధికారి అనూష, ఎంపీవో అబ్దుల్ వాజిద్, ఏఈ ఇరిగేషన్, ఏఈ మిషన్ భగీరథ, ఏపీపీఆర్, ఏపీవో, ఏఈవో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Drug Awareness | డ్రగ్స్‌తో నష్టాలపై సమన్వయంతో అవగాహన కల్పించాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్