Amazon Summer Sale | సమ్మర్ సేల్ కు అమెజాన్ రెడీ.. మే 8 నుంచే గ్రేట్ సమ్మర్ సేల్

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Amazon Summer Sale | అమెజాన్ (Amazon) సమ్మర్ సేల్ తిరిగి వచ్చేసింది. కంపెనీ తన పాపులర్ గ్రేట్ సమ్మర్ సేల్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది. సేల్ తేదీన ప్రకటించింది.

ఈనెల 8న ప్రారంభమయ్యే సేల్‌లో పలు ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అందించనున్నట్లు ప్రకటించింది. ఆఫర్లు త్వరలో రివీల్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు సేల్ 24 గంటల ముందే అందుబాటులో ఉండనుంది.

Amazon Summer Sale | స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు!

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ లో పలు స్మార్ట్ ఫోన్ల (Smart Phones)పై మంచి ఆఫర్లు ఉంటాయని భావిస్తున్నారు. ముఖ్యంగా బడ్జెట్ రేంజ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు లభించే అవకాశాలున్నాయి. రూ. 10 వేల నుంచి రూ. 25 వేల మధ్య ధరలోని స్మార్ట్‌ఫోన్‌లపై కంపెనీలు భారీ ఆఫర్లను అందిస్తాయని అంచనా వేస్తున్నారు. శాంసంగ్, షావోమీ, ఐక్యూ వంటి బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ ధరల్లో దొరకవచ్చు. శాంసంగ్, వన్‌ప్లస్ వంటి బ్రాండ్‌ల నుంచి పాపులర్ ఫోన్‌లను సరసమైన ధరలకు సొంతం చేసుకునే అవకాశాలున్నాయి. తక్షణ డిస్కౌంట్లతో పాటు బ్యాంక్ ఆఫర్లను కూడా అందించనుంది.

Amazon Summer Sale | ఆఫర్లే ఆఫర్లు..

సేల్ లో బండిల్ ఆఫర్లు కూడా ఉంటాయి. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, యాక్సెసరీస్‌పై డిస్కౌంట్లు ఉండే అవకాశాలున్నాయి. హోమ్ అప్లయెన్సెస్‌లో ఎయిర్ కండిషనర్స్ (Air Conditioners), ఫ్రిజ్‌లు, వాషింగ్ మిషన్లు, స్మార్ట్ టీవీలు, ఆడియో ప్రాడక్ట్స్, వేరబుల్స్‌పైనా ఆఫర్లుంటాయి. ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ ఎసెన్షియల్స్‌లో కాంబో డీల్స్, బండిల్ ఆఫర్లు ఉంటాయి. లైట్నింగ్ డీల్స్ (Lightning Deals), టాప్ 100 డీల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. చెకఅవుట్ వేగంగా పూర్తయ్యేలా కొత్త ఫీచర్స్, సేఫ్ పేమెంట్ ఆప్షన్స్ తీసుకువచ్చారు. బోట్ ఆడియో ప్రాడక్ట్స్‌పై 70 శాతం వరకు, క్యూబో ప్రాడక్ట్స్‌పై 60 శాతం వరకు, ఆసుస్ ల్యాప్‌టాప్‌లపై 35 శాతం వరకు, వన్‌ప్లస్ డివైసెస్‌పై 27 శాతం వరకు తగ్గింపు ఉంటుంది.

ఇది కూడా చదవండి..: Auto Sales in India | ఆటో.. అదరహో.. రికార్డు స్థాయిలో వాహనాల విక్రయాలు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *