అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Market | అధికస్థాయిలలో కొనసాగుతున్న ముడి చమురు ధరలు ఆందోళన కలిగిస్తుండడంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్ స్థబ్ధుగా ప్రారంభమైంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినా.. వచ్చే సమావేశంలో పెంపు నిర్ణయం తీసుకంటారన్న అంచనాలతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. అయితే కనిష్టాల వద్ద మదుపరులు వాల్యూ బయ్యింగ్‌కు దిగుతుండడంతో సూచీలు కోలుకున్నాయి.
Indian Stock Market | ఫ్లాట్‌గా ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) గురువారం ఫ్లాట్ గా ప్రారంభమైంది. సెన్సెక్స్ 22 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా మొదట్లో 87 పాయింట్లు తగ్గింది. ఆ తర్వాత కోలుకుని ఇంట్రాడే కనిష్టాలనుంచి 681 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 08 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 34 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 218 పాయింట్లు పైకి ఎగబాకింది. మధ్యాహ్నం 12.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 632 పాయింట్ల లాభంతో 73,878 వద్ద, నిఫ్టీ 169 పాయింట్ల లాభంతో 22,868 వద్ద ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 23 స్టాక్స్ లాభాలతో, 7 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. అదానీపోర్ట్స్ 5.43 శాతం, పవర్‌గ్రిడ్ 4.32 శాతం, కొటక్ బ్యాంక్ 3.27 శాతం, ఎటర్నల్ 2.73 శాతం, ఎన్టీపీసీ 2.28 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ట్రెంట్ 1.93 శాతం, ఆసియన్ పెయింట్స్ 1.16 శాతం, టాటా స్టీల్ 0.53 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.28 శాతం, మారుతి 0.26 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Jio Platforms IPO | ‘జియో’ అద్భుతం.. ఆరేళ్లలో రూ. 6,500 కోట్లకు పెరిగిన సంపద