TTD New Chairman | నేటితో యుగియనున్న టీటీడీ పాలక మండలి గడువు.. కొత్త ఛైర్మన్ ఎవరయ్యేనో..!

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నేడు ముగియనుంది.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : TTD New Chairman | తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) పాలక మండలి నేడు ముగియనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 2024 నవంబర్ 1న ఛైర్మన్​గా బీఆర్ నాయుడు, 24 మంది సభ్యులతో కలిపి నూతన పాలక మండలి నియమించారు. దీనికి రెండేళ్ల కాల పరిమితి విధించారు. ప్రస్తుతం ఆ సమయం ముగియడంతో కొత్త మండలిపై కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

TTD New Chairman | ఎన్నికల కోడ్​ నేపథ్యంలో..

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో.. నూతన పాలకమండలి నియామకానికి సాంకేతిక చిక్కులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాత్కాలికంగా ‘స్పెసిఫైడ్ అథారిటీ’ని నియమించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. అయితే, సాధారణంగా టీటీడీ బోర్డు పదవీకాలం ముగిసిన వెంటనే కొత్త బోర్డును ప్రకటించడం ఆనవాయితీ. కానీ ఎన్నికల కోడ్​ అమలులో ఉండడంతో కొత్త బోర్డు ఏర్పాటు సాధ్యపడకపోవచ్చు.

TTD New Chairman | ఎన్నికల అనంతరమే..

బీఆర్ నాయుడు ఛైర్మన్​గా నియమించిన బోర్డు గడువు ముగియనుంది. దీంతో.. కొత్త ఛైర్మన్ సహా సభ్యులు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. కొత్త బోర్డుపై ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు చర్చ సాగుతోంది. అయితే.. ఎన్నికలు పూర్తయిన తరువాత అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.

TTD New Chairman | కొత్త ఛైర్మన్​ ఎవరు..

కొత్త ఛైర్మన్​​గా టీడీపీలోని ఇద్దరు సీనియర్ నేతలు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరేమో టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పని చేసిన కళా వెంకటరావు కాగా.. మరొకరు టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా.. ఇంకోవైపు ప్రస్తుత ఛైర్మన్ బీఆర్ నాయుడుకు మరో ఏడాది అవకాశం ఇస్తారనే వాదన కూడా వినిపిస్తోంది. ఇక సభ్యుల నియామకం కూడా చేయాల్సి ఉంది. సభ్యుల్లో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి బోర్డు సభ్యులుగా నియామించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీటీడీ నూతన ఛైర్మన్.. బోర్డు సభ్యులుగా ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తి నెలకొంది.

ఇది కూడా చదవండి..: Bear cubs killed by train | రైలు ఢీకొని రెండు ఎలుగుబంటి పిల్లల దుర్మరణం.. తీవ్ర విచారం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *