అక్షరటుడే వెబ్‌డెస్క్: Jahangirpuri LPG Blast | ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన ఒక వ్యక్తి తన సొంత ఇంటికే నిప్పు పెట్టడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పే క్రమంలో ఎల్‌పీజీ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌లో ఉన్న ఒక ఫైర్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.
Jahangirpuri LPG Blast | సొంత ఇంటికే నిప్పు ..
జహంగీర్‌పురి ప్రాంతానికి చెందిన భరత్ (30) అనే వ్యక్తి తీవ్రంగా మద్యానికి బానిసయ్యాడు. ఇతను తన తల్లి రాజ్ రాణితో కలిసి మూడంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో నివాసముంటున్నాడు. మద్యం మత్తులో ఉన్న భరత్ ప్రమాదకర రీతిలో ఇంటికి నిప్పు పెట్టాడు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
Jahangirpuri LPG Blast | ఆర్పుతుండగా పేలిన సిలిండర్..
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజిన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే చర్యలు ప్రారంభించాయి. మూడంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లోని గృహోపకరణాలకు, ఎల్‌పీజీ సిలిండర్‌కు అప్పటికే మంటలు అంటుకున్నాయి. ఫైర్ సిబ్బంది శ్రమిస్తుండగా, ఒక్కసారిగా ఎల్‌పీజీ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి మంటలు, భవనం శిథిలాలు బయటకు ఎగిరిపడిన భయాందోళనకర దృశ్యాలు అక్కడి వీడియో కెమెరాల్లో రికార్డయ్యాయి.
Jahangirpuri LPG Blast | ఫైర్‌మెన్‌కు తీవ్ర గాయాలు..
ఈ అకస్మాత్తు పేలుడులో అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న అంకిత్ (32) అనే సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ముఖం, రెండు చేతులపై కాలిన గాయాలయ్యాయి. వెంటనే ఆయనను బాబూ జగ్జీవన్ రామ్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించగా, 25 శాతం కాలిన గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం లోక్‌నాయక్ జైప్రకాష్ (LNJP) ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సొంత ఇంటికి నిప్పు పెట్టి ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిన నిందితుడు భరత్‌పై జహంగీర్‌పురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
A gas cylinder caught fire inside a house in Jahangirpuri. The family called the fire brigade, but just as the firefighters reached the entrance of the house, the cylinder exploded, leaving one person seriously injured. 😳 https://t.co/gtn5akJlS3
— IndianLafda (@IndianLafdaa) October 30, 2026
ఇది కూడా చదవండి: HYDRAA Demolitions | రామంతాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు