అక్షరటుడే వెబ్‌డెస్క్: Panchkula LKG Girl Attack | హర్యానాలోని పంచకులలో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే ఘటన వెలుగుచూసింది. క్లాస్‌రూమ్‌లో ఎవరూ లేని సమయాన్ని చూసి ఓ 8 ఏళ్ల బాలుడు ఎల్కేజీ పసిపాపపై అత్యంత కిరాతకంగా దాడి చేసి, ప్రాణాపాయ స్థితికి నెట్టాడు. పంచకుల సెక్టార్ 20లోని సంస్కృతి మోడల్ స్కూల్లో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు.
Panchkula LKG Girl Attack | రాక్షసత్వంగా దాడి..
తరగతి గదిలో ఉపాధ్యాయులు లేని సమయాన్ని చూసి 3వ తరగతి చదువుతున్న బాలుడు (8) చిన్నారిపై విచక్షణారహితంగా విరుచుకుపడ్డాడు. పసిపాప తలను టేబుల్‌కు కొట్టడమే కాకుండా, కింద పడేసి తీవ్రంగా తంతూ హింసించాడు. చిన్నారి బతిమాలుతున్నా వినకుండా గొంతుపై తక్కుతూ రాక్షసంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగక బయటకు వెళ్లి ఇటుక, పూల కుండీ తెచ్చి చిన్నారి తలపై పదే పదే కొట్టాడు. డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) రెజ్లింగ్‌ను తలపించేలా ఆ పసిపాప స్పృహ తప్పి పడిపోయే వరకు ఈ దారుణానికి ఒడిగట్టాడు. తీవ్రంగా గాయపడి రక్తం కక్కుతున్న ఆ చిన్నారిని వెంటనే చండీగఢ్‌లోని ‘పిజిఐఎమ్ఈఆర్’ (PGIMER) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Panchkula LKG Girl Attack | నిర్లక్ష్యంపై ఆగ్రహం..
ఈ ఘటనపై తల్లిదండ్రులు, నెటిజన్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. క్లాస్‌రూమ్‌లో అంత పెద్ద దాడి జరుగుతుంటే టీచర్లు, ఆయాలు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నిస్తున్నారు. పాఠశాలల్లో పిల్లలకు కనీస రక్షణ లేకుండా పోతోందని, స్కూల్ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని మండిపడుతున్నారు.
Panchkula LKG Girl Attack | పిల్లల్లో పెరుగుతున్న క్రూరత్వం..
పసి వయసులోనే పిల్లల్లో ఇంతటి రాక్షసత్వానికి కారణమేంటనే దానిపై తీవ్ర చర్చ నడుస్తోంది. దీనిపై సైకాలజిస్టులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇచ్చి క్రైమ్ ఎపిసోడ్లు, హింసాత్మక రీల్స్, డబ్ల్యూడబ్ల్యూఈ లాంటి షోలు చూడనివ్వడం వల్ల వారిలో ఈ తరహా క్రిమినల్ ప్రవర్తన పెరుగుతోందని చెబుతున్నారు. అలాగే తల్లిదండ్రుల అతి గారాబం వల్ల చిన్నతనంలోనే ఇతరులను కొట్టడం, తంటాడి ప్రవర్తించడాన్ని సరిదిద్దకపోవడం వల్ల కూడా అదుపులేని ధోరణి ఏర్పడుతుందని స్పష్టం చేస్తున్నారు.
పిల్లలలో మానసిక వికాసాన్ని పెంపొందించడానికి తల్లిదండ్రులు తగిన శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇవ్వడం తక్షణమే నిలిపివేయాలని, వారి సమక్షంలో హింసాత్మక షోలు లేదా క్రైమ్ సినిమాలు చూడకూడదని హెచ్చరిస్తున్నారు. చిన్ననాటి నుంచే మంచి నీతి కథలు చెబుతూ, ఇతరు పట్ల దయ, సానుభూతి కలిగేలా పెంచాలని సలహా ఇస్తున్నారు.
How can a child so young display such extreme aggression? 😢
The Panchkula school incident, where a Class III student allegedly brutally attacked a KG girl with stones and a flowerpot, is deeply disturbing.
Schools need more than academics. Emotional intelligence, anger management, empathy and behavioural counselling should be part of the curriculum, just like sports and moral science.
We also need to question the school’s supervision and child safety arrangements.
I couldn’t even watch the entire video. Literally had goosebumps. 😢
Who is taking responsibility for protecting our children?
#panchkula #School— Crow Dhillon 🦢 (@CrowDhillon8) October 31, 2026
ఇది కూడా చదవండి : BRS Rythu Garjana | రైతు సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట