అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: Drinking Water Supply | ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ (Collector Garima Agrawal) ఆదేశించారు. వేసవి కాల సన్నద్ధత, తాగునీటి సరఫరాకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టరేట్లో శుక్రవారం మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Drinking Water Supply | అగ్రహారం.. రుద్రవరం పంప్‌హౌస్‌లలో.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. అగ్రహారం, రుద్రవరం పంప్‌హౌస్‌లలోని పంపుసెట్లను ఎప్పుడూ సిద్ధంగా ఉంచాలని, ఇంకా కావాల్సిన యంత్రాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో మిషన్ భగీరథ ఎస్ఈ రాములు, ఈఈలు ముజాహిద్ అన్వర్, సుమలత, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు రాము, విశ్వన్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Wardhannapet Accident | బైక్‌ను ఢీకొన్న కారు.. తండ్రీకొడుకులకు గాయాలు