అక్షరటుడే, వెబ్‌డెస్క్: Wardhannapet Accident | వరంగల్ జిల్లా (Warangal district) వర్దన్నపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న తండ్రీకుమారులను వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వారు తీవ్రంగా గాయపడ్డారు.
గుగులోతు సురేష్, ఆయన కుమారుడు అభిరామ్ బైక్‌పై బయటకు వచ్చారు. వర్దన్నపేటలో జాతీయ రహదారిపై ఓ పక్కన ఆగారు. అనంతరం రోడ్డుకు అవతలి వైపు వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు వారి బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్‌తో సహా వారు కొంత దూరంలో ఎగిరిపడ్డారు. శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Wardhannapet Accident | ఎంజీఎంకు తరలింపు
ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ (CCTV) కెమెరాలో నమోదయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సురేష్‌కు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం (MGM) ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Narsingi Road Alignment | రియల్ ఎస్టేట్ సంస్థ కోసం 2 వేల ఇళ్లు కూల్చే కుట్ర : హరీశ్‌రావు