Drinking Water Supply | తాగునీటి సరఫరాకు ముందస్తు చర్యలు చేపట్టాలి

ఎల్​నినో ప్రభావం నేపథ్యంలో తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: Drinking Water Supply | ఎల్​నినో ప్రభావం నేపథ్యంలో తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ (Collector Garima Agrawal) ఆదేశించారు. వేసవి కాల సన్నద్ధత, తాగునీటి సరఫరాకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టరేట్​లో శుక్రవారం మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Drinking Water Supply | అగ్రహారం.. రుద్రవరం పంప్​హౌస్​లలో.

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. అగ్రహారం, రుద్రవరం పంప్‌హౌస్‌లలోని పంపుసెట్లను ఎప్పుడూ సిద్ధంగా ఉంచాలని, ఇంకా కావాల్సిన యంత్రాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో మిషన్ భగీరథ ఎస్​ఈ రాములు, ఈఈలు ముజాహిద్ అన్వర్, సుమలత, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు రాము, విశ్వన్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Wardhannapet Accident | బైక్​ను ఢీకొన్న కారు.. తండ్రీకొడుకులకు గాయాలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *