అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: Rajarajeshwara Temple Development | వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనులపై సమీక్షించారు. కలెక్టరేట్లో జిల్లా పాలనాధికారి గరిమ అగ్రవాల్ (Collector Garima Agrawal) వీసీలో పాల్గొన్నారు.
Rajarajeshwara Temple Development | భక్తులకు కల్పించాల్సిన వసతులపై..
రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పురోగతి, వివిధ దశల్లో ఉన్న పనులు, టెండర్ ప్రక్రియ, , భక్తులకు కల్పించాల్సిన మౌలిక వసతులు తదితర అంశాలపై సమీక్షించారు. ఇప్పటికే చేపట్టిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడంతో పాటు, మంజూరైన పనులకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయడంపై చర్చించారు. ఆలయ అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ సూచించారు. ఉన్నతాధికారుల సూచనలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. సమావేశంలో ఆర్అండ్బీ సీఈ రాజేశ్వర్ రెడ్డి, దేవాదాయ శాఖ ధార్మిక సలహాదారు గోవింద హరి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Drinking Water Supply | తాగునీటి సరఫరాకు ముందస్తు చర్యలు చేపట్టాలి