అక్షరటుడే, వెబ్‌డెస్క్: illegal egg donation | హైదరాబాద్ Hyderabad మహా నగరంలో పేదరికమే పెట్టుబడిగా సాగుతున్న అభాగ్య మహిళల శోషణ తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది! ప్రముఖ ఫెర్టిలిటీ కేంద్రాలు, ఐవీఎఫ్ (IVF) ఆస్పత్రుల ముసుగులో అమాయక యువతుల జీవితాలతో ఆడుకుంటున్న అంతర్రాష్ట్ర ‘ఊసైట్ డొనేషన్’ అక్రమ రవాణా ముఠా గుట్టును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు పక్కా సమాచారంతో ఛేదించారు.
ఈ దారుణమైన రాకెట్‌కు సంబంధించిన విస్తుపోయే వివరాలను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి శనివారం సికింద్రాబాద్‌లోని క్యాంప్ ఆఫీస్‌లో మీడియాకు వెల్లడించారు.
illegal egg donation | అద్దె హాస్టళ్లలో నరకకూపం!
మధ్యప్రదేశ్‌కు చెందిన అమిత్ శర్మ, కోల్‌కతాకు చెందిన నిక్కత్ పర్వీన్, నాంపల్లికి చెందిన దుర్గాప్రసాద్‌తో కూడిన ఈ అంతర్రాష్ట్ర ముఠా అత్యంత పక్కా ప్రణాళికతో అక్రమ దందాను విస్తరించింది. బేగంపేట్ ప్రకాశ్ నగర్‌లో నెలకు రూ.50 వేలు చెల్లించి ఒక భవనాన్ని, అలాగే సరూర్‌నగర్‌లోని వెంకటేశ్వర కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ‘శెట్టి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్’ పేరిట ఈ దందాను సాగిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల నుంచి నిస్సహాయులైన పేద యువతులను లక్ష్యంగా చేసుకుని.. అండాలు దానం చేస్తే రూ.20 వేల నుంచి రూ.30 వేలు ఇస్తామని ఆశచూపి హైదరాబాద్ రప్పించారు.
నగరానికి తీసుకొచ్చిన తర్వాత వారిని రహస్య వసతి గృహాలలో బంధించి, ఎలాంటి ప్రాథమిక వైద్య పర్యవేక్షణ లేకుండా ప్రమాదకరమైన హార్మోన్ ఇంజెక్షన్లు, మాత్రలు ఇస్తూ వారి ఆరోగ్యంతో చెలగాటమాడారు.
నకిలీ గుర్తింపు కార్డులు, బోగస్ అఫిడవిట్లతో చట్ట నిబంధనలకు తూట్లు పొడిచి, ఒక్కో యువతి అండాలపై ఫెర్టిలిటీ కేంద్రాల ద్వారా ఏకంగా రూ.3 లక్షల వరకు దండుకున్నారు.
illegal egg donation | అర్ధరాత్రి ఏకకాలంలో మెరుపు దాడులు..
విశ్వసనీయ సమాచారం అందడంతో బేగంపేట, సరూర్‌నగర్ పోలీసులు, మల్కాజిగిరి ఎస్‌ఓటీ (SOT) బృందాలు శుక్రవారం రాత్రి ఏకకాలంలో దాడులు జరిపాయి. ప్రకాశ్ నగర్, ఎర్రగడ్డ, సరూర్‌నగర్, గోపాలపురం ప్రాంతాల్లో నిర్వహించిన ఈ దాడుల్లో 49 మంది యువతులను సురక్షితంగా రక్షించారు. రక్షించబడిన 49 మంది యువతులలో ఇద్దరు గర్భిణులు కూడా ఉండటం ఈ దందాలోని తీవ్రతకు నిదర్శనం.
illegal egg donation | 10 మంది ముఠా అరెస్టు!
ఈ అక్రమ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్న ముఠా సభ్యులు, సబ్-ఏజెంట్లు, ఏఆర్‌టీ కోఆర్డినేటర్లు సహా మొత్తం 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
అమిత్ శర్మ, నిక్కత్ పర్వీన్, దుర్గాప్రసాద్, శేఖర్, రేష్మా ఖాతూన్, మేఘావత్ శ్రీనివాస్ (అలియాస్ సోను), జెఫ్రే ప్రదీప్, విజయ్ భగవాన్ రావు సాలుంకే, పాత నేరస్థుడు పంకజ్ సోనీ, షేక్ పర్వీన్‌లను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వీరి నుంచి భారీగా ఇంజెక్షన్లు, సిరంజీలు, ప్రమాదకరమైన మందులు, అనుమానాస్పద పత్రాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
illegal egg donation | ఆస్పత్రులపై కఠిన చర్యలు
సంతాన సాఫల్య నిబంధనలను ఉల్లంఘించి ఈ దందాకు సహకరించిన కార్పొరేట్ ఫెర్టిలిటీ సెంటర్లు, డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ బి. సుమతి హెచ్చరించారు. అనుమానాస్పద కార్యకలాపాలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
ఈ భారీ రాకెట్‌ను విజయవంతంగా ఛేదించిన డీసీపీలు శ్రీధర్, మనోహర్, ఏసీపీలు గోపాలకృష్ణమూర్తి, రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు సైదులు, శివలింగం, శ్రీశైలం, శేఖర్ బృందాలను సీపీ ప్రత్యక్షంగా అభినందించారు.