అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cyclone Alert | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపాన్‌గా మారే అవకాశం ఉంది. ఇది నవంబర్ 3న తీరాన్ని తాకనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి సోమవారం నాటికి తుపాన్‌గా మారనుంది. నవంబర్ 3 ఉదయానికి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం గత ఆరు గంటల్లో గంటకు 23 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడింది. ఆదివారం ఉదయం వాయుగుండం విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 770 కి.మీ, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 770 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
Cyclone Alert | భారీగా గాలులు
ఇటీవల అర్నబ్ తుపాన్ సృష్టించిన బీభత్సం నుంచి ఆంధ్ర ప్రదేశ్ ఇంకా కోలుకోలేదు. తుపాన్ తీవ్ర విధ్వంసం సృష్టించడంతో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ క్రమంలో మరో తుపాన్ దూసుకొస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నవంబర్ 3 ఉదయానికి నెల్లూరు–నర్సాపురం మధ్య తుపాన్ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు 100-110 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Cyclone Alert | తెలంగాణలో..
వాయుగండం ప్రభావంతో తెలంగాణలో శనివారం నుంచి అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. నేడు సైతం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హన్మకొండ, వరంగల్, జనగామ, భువనగిరి, మహబూబాబాద్, కరీంనగర్, సిద్దిపేట, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయి. మిగతా జిల్లాల్లో సైతం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. చిరు జల్లులు కురిసే ఛాన్స్ ఉంది.
దీనిని కూడా చదవండి : Nizamabad DCSO Suspension | రైస్‌మిల్లుల తనిఖీల్లో నిర్లక్ష్యం.. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సస్పెన్షన్