క్రీడలుIPL 2026 Second Half | ఐపీఎల్‌లో ఉత్కంఠ రేపుతున్న సెకండాఫ్‌.. పాయింట్ల పట్టికలో భారీ...

IPL 2026 Second Half | ఐపీఎల్‌లో ఉత్కంఠ రేపుతున్న సెకండాఫ్‌.. పాయింట్ల పట్టికలో భారీ మార్పులు

ఐపీఎల్ 2026 రెండో దశ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. టాప్‌లో ఉన్న జట్లు వరుస ఓటములు చవిచూస్తుండగా, కింద ఉన్న జట్లు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంటున్నాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPL 2026 Second Half | ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League 2026) సీజన్ రెండో భాగం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటివరకు వరుస విజయాలతో దూసుకెళ్లిన జట్లు ఒక్కొక్కటిగా ఓటమి పాలవుతుండగా, కింద ఉన్న జట్లు ప్లే ఆఫ్స్ బరిలోకి రావడానికి తీవ్రంగా పోరాడుతున్నాయి.

పంజాబ్, ఆర్సీబీ తర్వాత తాజాగా రాజస్థాన్ రాయల్స్ కూడా ఓటమి చవిచూసింది. ఈ సమయంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ (Sunrisers Hyderabad) మాత్రం విజయంతో ప్రత్యేకంగా నిలిచింది. ఇక జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ తలపడ్డాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుని 225/6 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఎదుర్కొన్న ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత ప్రదర్శనతో 19.1 ఓవర్లలోనే ఛేదించి కీలక విజయాన్ని సాధించింది.

IPL 2026 Second Half | ప్ర‌తి మ్యాచ్ ఉత్కంఠే..

ఈ మ్యాచ్‌లో నిస్సాంక, కేఎల్ రాహుల్ రాణించడం ఢిల్లీ విజయానికి ప్రధాన కారణమైంది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకింది. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ 4 విజయాలు, 5 ఓటములతో 8 పాయింట్లు సాధించి ఏడో స్థానంలో ఉండగా, ఇప్పుడు ఆరో స్థానానికి చేరుకుంది. మరోవైపు, చెన్నై సూప‌ర్ కింగ్స్ (Chennai Super Kings) ఒక స్థానానికి పడిపోయి ఏడో స్థానంలోకి వెళ్లింది. ఇక ఓటమి చవిచూసిన రాజస్థాన్ రాయల్స్ మాత్రం 10 మ్యాచ్‌లలో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అయితే ఈ ఓటమి కారణంగా ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలపై కొంత ఒత్తిడి పెరిగింది.

IPL 2026 Second Half | మరింత ఉత్కంఠభరితంగా..

ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఢిల్లీ క్యాపిటల్స్‌కు మిగిలిన ఐదు మ్యాచ్‌లు కీలకంగా మారాయి. సీఎస్కే, పంజాబ్, రాజస్థాన్‌తో ఒక్కొక్క మ్యాచ్, అలాగే కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (Kolkata Knight Riders)తో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ ఐదు మ్యాచ్‌లలో కనీసం నాలుగు గెలిస్తేనే ప్లే ఆఫ్స్ ఆశలు బలంగా నిలుస్తాయి. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి కూడా అంత సులభంగా లేదు. మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో కనీసం మూడు గెలవాల్సిందే. ఆ జట్టు ముందున్న మ్యాచ్‌లు గుజరాత్, ఢిల్లీ, లక్నో, ముంబైతో ఉండటం గమనార్హం. కాబట్టి ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది. ఏది ఏమైన ఐపీఎల్ 2026లో ప్లే ఆఫ్స్ రేసు మరింత ఉత్కంఠభరితంగా మారింది. ప్రతి మ్యాచ్ ఫలితం పాయింట్ల పట్టికను ప్రభావితం చేస్తుండటంతో అభిమానులకు రసవత్తర పోరు కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి..: MS Dhoni IPL | ఫిట్‌గానే ఉన్న‌ ధోనీ స్టేడియంకు కూడా ఎందుకు రావడం లేదు?.. అసలు కారణం చెప్పిన మైక్ హస్సీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

KTR comments | కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదు : కేటీఆర్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR comments | కాంగ్రెస్​ మళ్లీ అధికారంలోకి...

Collector ila tripathi | అందరి భాగస్వామ్యంతోనే సత్వర ప్రగతి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

అక్షరటుడే, బోధన్: Collector ila tripathi | అభివృద్ధి కార్యక్రమాల్లో అన్నివర్గాల...

South Central Railway trains | ప్రయాణికులకు అలెర్ట్​.. 6 రైళ్లను క్రమబద్ధీకరించిన దక్షిణ మధ్య రైల్వే

అక్షరటుడే, వెబ్​డెస్క్ : South Central Railway trains | నిజామాబాద్​...

Welfare Schemes | ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలి: షబ్బీర్ అలీ

అక్షరటుడే, కామారెడ్డి: Welfare Schemes | ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న...