Delhi Pollution | ఢిల్లీలో పాత వాహనాలపై నిషేధం.. వర్క్​ ఫ్రమ్​ హోమ్​పై కీలక ఆదేశాలు

ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని (Air Pollution) తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాత వాహనాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

చలికాలం వచ్చిదంటే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగి ప్రజలు ఇబ్బందుఉల పడతారు. గాలి నాణ్యత పడిపోయి, అనేక మంది అనారోగ్యాల బారీన పడుతుంటారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ ప్రభుత్వం ఈ ఏడాది ముందుగానే అప్రమత్తం అయింది. కఠినమైన నిబంధనలు అమలులోకి తీసుకు వచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, నవంబర్ 1, 2026 నుండి ఢిల్లీలో నాన్-బిఎస్6 వాహనాల ప్రవేశం, కార్యకలాపాలు నిషేధించారు. ఈ ఆంక్షలు జనవరి 31, 2027 వరకు అమల్లో ఉంటాయి. ఈ నిబంధనలు అమలు చేయడానికి ప్రత్యేక బృందాలు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు, ఏఐ-ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) మద్దతు తీసుకుంటారు. నిబంధనలకు అనుగుణంగా లేని వాహనాలకు భారీగా జరిమానాలు వేస్తామని ప్రభుత్వం తెలిపింది.

Delhi Pollution | ఆంక్షలు ఇవే..

బీఎస్-VI ప్రమాణాలకు అనుగుణంగా లేని వాహనాలను ఢిల్లీలోకి ప్రవేశించకుండా నిషేధించారు. ఎలక్ట్రిక్, సీఎన్​జీ వాహనాలతో పాటు అంబులెన్సులు, ఫైర్ టెండర్ల వంటి అత్యవసర రవాణా వాహనాలకు మినహాయింపు ఉంది. నవంబర్ 1 నుండి జనవరి 31 వరకు దుమ్మును సృష్టించే అన్ని కూల్చివేత, సివిల్ నిర్మాణ కార్యకలాపాలను నిషేధించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

Delhi Pollution | వారికి వర్క్​ ఫ్రమ్​ హోమ్​

కాలుష్యాన్ని తగ్గించడానికి వర్క్​ ఫ్రమ్​ హోమ్​ అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు తమ సిబ్బందిలో సగం మందిని మాత్రమే భౌతికంగా హాజరుపరచాలని, మిగిలిన ఉద్యోగులు ఇంటి నుండి పని చేయాలని ఆదేశించింది. అత్యవసర సేవలకు ఈ నిబంధన నుండి మినహాయింపు ఉంది. రద్దీ తగ్గించేందుకు పలు కార్యాలయ సమయాలను అధికారులు మార్చారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలు ఉదయం 8.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుండగా, ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేస్తాయి. అంతేగాకుండా వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు పార్కింగ్​ ఫీజులను రెట్టింపు చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

దీనిని కూడా చదవండి : INDIA Alliance Rally | ఇండియా కూటమి ర్యాలీ.. ఢిల్లీలో భారీ భద్రత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *