Vote Theft Allegations | ఓట్ల చోరీతోనే బీజేపీ గెలుస్తోంది : రాహుల్​ గాంధీ

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vote Theft Allegations | ఓట్ల చోరీతోనే బీజేపీ ఎన్నికల్లో గెలుస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆదివారం ఢిల్లీలోని రామ్​లీలా మైదాన్​లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటమే తమ సంకల్పమని రాహుల్​ అన్నారు. రాజ్యాంగమే అందరికంటే గొప్పదన్నారు. బెంగాల్​, మధ్యప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. 2024 ఎన్నికల తర్వాత 13.5 కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించారన్నారు. ఈ గణాంకాలపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Vote Theft Allegations | జ్ఞానేశ్​కుమార్​ రాజీనామా చేయాలి

జ్ఞానేశ్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తప్పుకోవాలని రాహుల్​ గాంధీ అన్నారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావడానికి, అమిత్ షా హోంమంత్రి కావడానికి ఎన్నికల వ్యవస్థలో జరిగిన పరిణామాలే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్య, వైద్యం, సీబీఐ, ఈడీ, న్యాయవ్యవస్థ, బ్యూరోక్రసీ, పోలీసు వ్యవస్థ వంటి సంస్థలను ఆర్​ఎస్​ఎస్​ తన ఆధీనంలోకి తీసుకుందని విమర్శించారు. మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ దేశంలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని రాహుల్​ ఆరోపించారు. ఓటు చోరీపై (Vote Theft Allegations) ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు.

దీనిని కూడా చదవండి : Hyderabad Water Supply | హైదరాబాద్​ వాసులకు అలర్ట్​.. తాగునీటి సరఫరాలో అంతరాయం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *