Congress Rally | కాంగ్రెస్​ ర్యాలీ ఏఐ ఫొటోలపై కేంద్ర మంత్రి విమర్శలు

ఢిల్లీలో కాంగ్రెస్​ నిర్వహించిన ర్యాలీకి సంబంధించిన ఏఐ ఫొటోలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజ్​ విమర్శలు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Congress Rally | ఢిల్లీలోని రామ్​లీలా మైదానంలో ఆదివారం విపక్ష ఇండియా కూటమి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీకి సంబంధించిన పలు ఫొటోలను కాంగ్రెస్​ పార్టీ సోషల్​ మీడియాలో పోస్ట్​ చేసింది.

అయితే అవి ఏఐతో సృష్టించారని కేంద్ర మంత్రి కిరణ్​ రిజిజ్​ (Kiran Rijij) విమర్శించారు.తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ , ఇతర పార్టీ నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఉటంకిస్తూ, జనసందోహాన్ని చూపించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఏకంగా AI సృష్టించిన చిత్రాలను ఆశ్రయించిందని కిరణ్​ రిజిజ్​ ఎద్దేవా చేశారు. రామ్​లీలా మైదానానికి భారీగా ప్రజలు వచ్చారని చూపడానికి వారు సృష్టించిన ఏఐ ఫొటోలు కూడా సరిగా లేవన్నారు.

Congress Rally | ఏఐ ద్వారా..

ఎంపీ వంశీకృష్ణ పోస్ట్ చేసిన ఫొటోను కాంగ్రెస్​ నాయకులు విస్తృతంగా షేర్ చేశారు. అయితే అది ఏఐ ద్వారా తయారైందని నెటిజన్లు గుర్తించారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు సంబంధించిన చిత్రాలు కూడా AI ద్వారా సృష్టించబడ్డాయి. అవి అసలు వేదికపై ఉన్న దృశ్యాలకు భిన్నంగా కనిపించాయి. ఈ సభ పూర్తిగా విఫలమైందని బీజేపీ పేర్కొంది. ప్రతిపక్షాలు చెప్పుకున్నంత మంది జనం అక్కడ లేరని, మైదానంలో కనీసం 40 శాతం ఖాళీగా ఉందని చెబుతూ, బీజేపీ నాయకులు అక్కడ ఖాళీ కుర్చీలు ఉన్న ఫోటోలు, వీడియోలను విడుదల చేశారు.

Congress Rally | ట్రిక్కులతో ప్రధాని కాలేరు

ఈ సభకు పది లక్షల మంది వస్తారని కాంగ్రెస్​ చెప్పిందని, కానీ మైదానంలో 40 శాతం ఖాళీగా ఉందని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర అన్నారు. సభలో చూపిన జనసందోహం కేవలం “ట్రిక్ ఫోటోగ్రఫీ” (మాయాజాలం) అని పేర్కొన్న ఆయన, “ఇలాంటి ట్రిక్కులతో ఎవరూ ప్రధానమంత్రి కాలేరు” అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి విమర్శించారు.

ఇది కూడా చదవండి..: Digi Yatra international trials | అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. 7 ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో డిజి యాత్ర ట్రయల్స్ ప్రారంభం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *