అక్షరటుడే వెబ్డెస్క్: Borabanda Child Murder | మద్యం మత్తు మనిషిలోని మానవత్వాన్ని పూర్తిగా చంపేసింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న కొడుకునే ఒక తండ్రి దారుణంగా గొంతు నులిమి హత్య చేశాడు. హైదరాబాద్ ( Hyderabad ) నగరంలోని బోరబండ పరిధిలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
Borabanda Child Murder | మద్యం మత్తులో ..
బోరబండ శిల్పినగర్కు చెందిన విద్యాసాగర్ (36), దుర్గ దంపతులకు విజయ్ (5) అనే కుమారుడు ఉన్నాడు. నవంబర్ 1వ తేదీ రాత్రి విద్యాసాగర్ తీవ్రంగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఆ మత్తులో ఏమాత్రం సోయి లేకుండా నిద్రిస్తున్న ఐదేళ్ల కన్న కొడుకు విజయ్ను దారుణంగా గొంతు నులిమి హత్య చేశాడు.
Borabanda Child Murder | ఆస్పత్రికి తరలించినా ..
క్యాటరింగ్ పని ముగించుకుని మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చిన తల్లి దుర్గ, కొడుకు అచేతనంగా పడి ఉండటాన్ని గమనించింది. వెంటనే స్థానికుల సహాయంతో బాలుడిని ఆస్పత్రికి తరలించగా, అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మద్యం మత్తులో ఉన్న తండ్రే బాలుడి ప్రాణాలు తీశాడని పొరుగువారు చెప్పడంతో ఈ నిజా నిజాలు వెలుగులోకి వచ్చాయి.
Borabanda Child Murder | పరారీలో నిందితుడు..
సమాచారం అందుకున్న బోరబండ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడు విద్యాసాగర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఇది కూడా చదవండి: Rajasthan Electric Shock | రోడ్డు పనుల్లో కరెంట్ షాక్.. 8 మంది కార్మికులు మృతి