అక్షరటుడే, వెబ్డెస్క్: AP municipal election counting | ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్ల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సర్వం సిద్ధం చేసింది.
మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండటంతో అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన తీర్పును వెల్లడించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
AP municipal election counting | 138 కౌంటింగ్ కేంద్రాలు..
కౌంటింగ్ ప్రక్రియకు భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 138 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 92 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లకు సంబంధించి ఈ ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా కౌంటింగ్ జరిగేందుకు మొత్తం 47,817 మంది సిబ్బందిని నియమించారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
AP municipal election counting | 62.16 శాతం ఓటింగ్ నమోదు..
ఇటీవలే ముగిసిన పోలింగ్లో రాష్ట్రవ్యాప్తంగా సగటున 62.16 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని బట్టి పట్టణ ప్రాంతాల్లో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కాగానే మొదటి రౌండ్ ఫలితాల ట్రెండ్స్ వెలువడే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.