Nov 03 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు..గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nov 03 Market Analysis | ఏఐ ఆధారిత టెక్నాలజీ స్టాక్‌లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. దీంతో వాల్‌స్ట్రీట్ ప్రధాన సూచీలు నష్టాలతో ముగిశాయి. దీని ప్రభావం ఆసియా Asia మార్కెట్లపైనా కనిపిస్తోంది. ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి.

అయితే యూఎస్ బాండ్ ఈల్డ్స్‌లో తగ్గుదల, పశ్చిమాసియాలో శాంతి కోసం చర్చలు జరుగుతుండడంతో క్రూడ్ ఆయిల్ ధరలు దిగివస్తుండడం, కంపెనీల బలమైన త్రైమాసిక ఆర్థిక ఫలితాల మద్దతుతో గిఫ్ట్ నిఫ్టీ లాభాల బాటలో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభం కానున్నాయి.

Nov 03 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 1.07 శాతం, ఎస్ అండ్ పీ 0.51 శాతం నష్టపోగా.. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.23 శాతం నష్టంతో ఉంది.

Nov 03 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.63 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.97 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.29 శాతం లాభంతో ముగిశాయి.

Nov 03 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో ఉన్నాయి. ఉదయం 7.30 గంటల ప్రాంతంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.11 శాతం లాభంతో ఉండగా.. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 2.69 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.19 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.87 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.85 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.33 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.48 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభం కానున్నాయి.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా రెండో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులు ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 3,114 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • డీఐఐలు గత సెషన్‌లో నికర అమ్మకందారులుగా నిలిచారు. రూ. 392 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు బలపడి 94.90 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 101.80 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.91 శాతం వద్ద ఉంది.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.42 నుంచి 1.40 కు తగ్గింది.
  • విక్స్ 1.29 శాతం పెరిగి 15.50 వద్ద ఉంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 104.78 డాలర్ల వద్ద ఉంది.
  • నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.
Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *