అక్షరటుడే, వెబ్డెస్క్: BLS Polymers IPO Listing | వైర్లు, కేబుళ్లు, భూగర్భ పైప్లైన్లలో ఉపయోగించే ప్రత్యేక పాలిమర్ సమ్మేళనాలను తయారుచేసే బీఎల్ఎస్ పాలిమర్స్ కంపెనీ మార్కెట్నుంచి రూ. 255 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవో (IPO)కు వచ్చింది. సబ్ స్క్రిప్షన్ అక్టోబర్ 27న ప్రారంభమై అక్టోబర్ 29న ముగిసింది. కంపెనీ షేర్లు మంగళవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ అయ్యాయి.
BLS Polymers IPO Listing | భారీ స్పందన..
ఇష్యూ సైజ్ చిన్నది కావడంతో ఇన్వెస్టర్లనుంచి భారీ స్పందన లభించింది. మొత్తం కోటా 241.22 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యింది. ఇందులో క్యూఐబీలు 200.25 రెట్లు, ఎన్ ఐఐలు 559.20 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు 128.36 రెట్లు సబ్స్క్రైబ్ చేసుకున్నారు.
BLS Polymers IPO Listing | జీఎంపీకి మించి లాభాలు..
కంపెనీ షేర్ల మంగళవారం ఉదయం 46 శాతం ఉంది. అయితే దీనికి మించిన ప్రీమియంతో కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చాయి. కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరును రూ. 150 కి విక్రయించగా.. 65.33 శాతం లాభంతో రూ. 248 వద్ద లిస్టయ్యింది. కంపెనీ షేర్లు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 79 శాతం ప్రీమియంతో రూ. 268.70 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి..: Indian Stock Market Rally | బుల్ జోరు.. భారీ లాభాల్లో మార్కెట్లు