Kamareddy Indira Gandhi statue | కామారెడ్డిలో ఇందిరాగాంధీ విగ్రహ ధ్వంసానికి యత్నం: సోషల్ మీడియాలో వీడియో వైరల్!

గుర్తుతెలియని ఒక వ్యక్తి ఇందిరాగాంధీ విగ్రహంపైకి ఎక్కి, విగ్రహం తల భాగంపై బండరాయితో విచక్షణారహితంగా బాదుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Indira Gandhi statue | కామారెడ్డి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. పాత బస్టాండ్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఇందిరా చౌక్‌లో ఉన్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఓ వ్యక్తి ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

Kamareddy Indira Gandhi statue | సోషల్ మీడియాలో వైరల్

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్)లో వేగంగా వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా… గుర్తుతెలియని ఒక వ్యక్తి ఇందిరాగాంధీ విగ్రహంపైకి ఎక్కి, విగ్రహం తల భాగంపై బండరాయితో విచక్షణారహితంగా బాదుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

రంగంలోకి పోలీసులు..

ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. సదరు వ్యక్తి మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా? లేక దీని వెనుక ఇతర కారణాలు లేదా రాజకీయ ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, నిందితుడిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *