అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR Comments | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి భూములు అమ్మే బ్రోకర్ అన్నారు. అడువులను నరికే వీరప్పన్‌ను అటవీ శాఖ మంత్రి చేస్తే ఎలా ఉంటుందో.. భూములు అమ్మే రేవంత్‌రెడ్డిని సీఎం చేస్తే అలా ఉందన్నారు.
హైదరాబాద్ (Hyderabad) నగరానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బుధవారం బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో వారికి కండువాలు కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏడాదిలోపు మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారన్నారు. రేవంత్ రెడ్డి వేసే ఎంగిలి మెతుకులకు ఎవరైనా పారిశ్రామికవేత్తలు ఆశపడి హిల్ట్ పాలసీ స్కాంలో భూములు కొంటే తిరిగి అనుభవిస్తారని హెచ్చరించారు. తమ ప్రభుత్వం వచ్చాక.. ఇప్పుడు జరుగుతున్న భూదందాలన్నింటికీ చెక్ పెడతామన్నారు.
KTR Comments | ఆ భూములు పేదలకు ఇవ్వాలి
కేసీఆర్ ఫాంహౌజ్ వద్ద అమరవీరులకు కాలనీ కట్టిస్తానంటున్న రేవంత్ రెడ్డి.. మియాపూర్ భూముల్లో కట్టి ఇవ్వాలని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారికి మియాపూర్ భూములు ఇస్తే తాము వద్దంటామా అన్నారు. మియాపూర్‌లో 550 ఎకరాల వస్తే అమ్మాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భూముల్లో 200 ఎకరాలు పేదలకు ఇండ్లు, 100 ఎకరాల్లో అమరవీరులకు, ఇంకో 100 ఎకరాలు ఉద్యమకారులకు, మిగతా భూమిలో పిల్లలకు స్కూల్స్, కాలేజీలు కట్టిస్తే స్వాగతిస్తామన్నారు. భూములు అమ్మడం.. కేసీఆర్‌ణు తిట్టడం తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. ఎన్నికలప్పుడు 3 నెలల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి.. గద్దెనెక్కి మూడేళ్లవుతున్నా రేవంత్ ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు.
ఇది కూడా చదవండి..: Gandhi Bhavan Meeting | గాంధీ భవన్‌కు చేరిన నేతల ‘ఢిల్లీ పంచాయితీ’