ATM Robbery Attempt | ఆర్మూర్​లో ఏటీఎం చోరీకి యత్నం

ఆర్మూర్ పట్టణంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి ఇద్దరు వ్యక్తులు యత్నించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, ఆర్మూర్​: ATM Robbery Attempt | ఆర్మూర్​ పట్టణంలో ఏటీఎం చోరీకి దొంగలు యత్నించారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

ఆర్మూర్ (Armoor) పట్టణంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలోకి రాత్రివేళ ఇద్దరు దుండగులు ప్రవేశించారు. రాడ్​ సాయంతో ధ్వంసం చేశారు. అనంతరం నగదు ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. అయితే నగదు ఉన్న బాక్సులు ఓపెన్ కాకపోవడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. నిందితులు ఏటీఎం ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Bio Mining | బయో మైనింగ్​ను వేగవంతం చేయాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *