అక్షరటుడే వెబ్‌డెస్క్: Ayyappa Society Land Scam | హైదరాబాద్‌లోని ఖానామేట్ అయ్యప్ప సొసైటీ పరిధిలో ఉన్న అత్యంత విలువైన భూముల రిజిస్ట్రేషన్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha )ఆరోపించారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె, అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో ఇళ్లు లేదా స్థలాలు కొనుగోలు చేసి ఎవరూ మోసపోవద్దని ప్రజలకు సూచించారు.
Ayyappa Society Land Scam | అక్రమ నిర్మాణాలు ..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యప్ప సొసైటీలో సుమారు 750కి పైగా అక్రమ నిర్మాణాలు వెలిశాయని కవిత పేర్కొన్నారు. ఖానామెట్ అయ్యప్ప సొసైటీ పరిధిలోనే నారాయణ, చైతన్య వంటి ప్రముఖ విద్యా సంస్థలు నడుస్తున్నాయని వివరించారు. సర్వే నంబర్ 11/18 నుంచి 11/44 వరకు పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నారని ఆమె ఘాటుగా ప్రశ్నించారు.
Ayyappa Society Land Scam | సంచలన ఆరోపణలు..
హైదరాబాద్ నగరం, టిడిఆర్ (TDR) అక్రమ దందాలపై తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలనపై శ్రద్ధ లేదని కవిత విమర్శించారు. ముఖ్యమంత్రి సోదరులు దగ్గరుండి మరీ దందాలు నడిపిస్తూ, అనుమతులు ఇప్పిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు.
Ayyappa Society Land Scam | అమిత్ షాపై విమర్శలు..
గురుకుల ట్రస్ట్ భూముల పరిరక్షణకు తాము అనేక పోరాటాలు చేశామని, అయ్యప్ప సొసైటీలో ఎలాంటి రిజిస్ట్రేషన్లకు అనుమతి ఉండదని కవిత స్పష్టం చేశారు. ఖానామెట్ అయ్యప్ప సొసైటీ పరిధిలోని భూములపై సమగ్ర సర్వే జరపాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి నెల రోజుల గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కేవలం రాజకీయాలకే ప్రాధాన్యమిచ్చారని విమర్శించారు.
ఇది కూడా చదవండి: US Midterm Election Results | అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌కు భారీ షాక్.. క్లీన్ స్వీప్ చేసిన డెమోక్రాట్లు