Meta Case India | చిన్నారుల లైంగిక వేధింపుల కంటెంట్‌.. మెటాపై కేసు నమోదు..

సోషల్​ మీడియాలో చిన్నారులకు సంబంధించిన లైంగిక దోపిడీ, వేధింపుల కంటెంట్ ఆరోపణలపై మెటాపై కేసు నమోదైంది.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Meta Case India | సోషల్​ మీడియాలో చిన్నారులకు సంబంధించిన లైంగిక దోపిడీ, వేధింపుల కంటెంట్ ఆరోపణలపై మెటాపై కేసు నమోదైంది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు (Delhi Police) కేసు నమోదు చేశారు. మెటా సంస్థ ప్లాట్‌ఫామ్‌లలో ఇలాంటి కంటెంట్‌ ఉన్నట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు కమిషన్‌ సభ్యుడు ప్రియాంక్‌ కనూంగో వెల్లడించారు.

Meta Case India | జులై 3న మెటాకు నోటీసులు..

ఈ వ్యవహారంలో ఎన్​సీపీసీఆర్ ఇప్పటికే విచారణ చేపట్టింది. జులై 3న మెటాకు నోటీసులు జారీ చేసింది. చిన్నారుల లైంగిక దోపిడీకి సంబంధించిన ప్రకటనలు, కంటెంట్‌ అంశంపై వివరణ ఇవ్వాలని కోరింది. దీనికి మెటా వారం రోజుల తర్వాత సమాధానం తెలిపింది. కానీ వివరణతోనే వ్యవహారాన్ని ముగించకుండా.. వాస్తవాలను నిర్ధారించేందుఉకు విచారణ చేపట్టాలని కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్‌ 16న విచారణకు హాజరవ్వాలని మెటా ఇండియా ఎండీ, సంస్థ అధిపతికి మరోసారి సమన్లు జారీ చేసింది. చిన్నారులపై లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్‌ ప్రకటనల రూపంలో రావడంపై కమిషన్‌ వివరణ కోరినట్లుగా సమాచారం.

Meta Case India | తన విధానంలో మెటా మార్పులు

చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులను ఇకపై భారత సైబర్‌ నేర సమన్వయ కేంద్రం (14C)కు నివేదించడం ప్రారంభించినట్లు మెటా తెలిపినట్లు సమాచారం. ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. తమ ప్లాట్‌ఫామ్‌లలో చిన్నారుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో చిన్నారుల దోపిడీ, సంబంధిత నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని వివరించారు. చిన్నారుల భద్రత అంశాలను కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండియన్‌ సైబర్‌ క్రైం కో–ఆర్డినేషన్‌ సెంటర్‌ నిర్వహించే సైబర్‌ క్రైం పోర్టల్‌కు నివేదించే విధానం ప్రారంభించామని సంస్థ వెల్లడించింది.

ఇది కూడా చదవండి..: Supreme Court Arrest Rules | అరెస్ట్​, నిర్బంధంపై సుప్రీంకోర్టు క్లారిటీ

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *