అక్షరటుడే, బాన్సువాడ: Sabarimala Maha Padayatra | పట్టణం నుంచి పవిత్ర శబరిమల క్షేత్రానికి చేపట్టిన ‘సువర్ణ భూమి శబరిమల మహా పాదయాత్ర’ గురువారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం(MLA Pocharam) శ్రీనివాసరెడ్డి స్వామిని దర్శించుకుని యాత్రను ప్రారంభించారు.
Sabarimala Maha Padayatra | స్వాముల సంకల్పం విజయవంతం కావాలని..
ఈ సందర్భంగా అయ్యప్ప స్వాముల సంకల్పం విజయవంతం కావాలని పోచారం ఆకాంక్షించారు. పాదయాత్ర సందర్భంగా పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఆగ్రోస్ మాజీ చైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Madhavanagar ROB | ఆర్వోబీ వద్ద బాజిరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం..