Hospital Regulations | నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలు: కలెక్టర్ ఇలా త్రిపాఠి

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించే ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.

shashi kiran Mottala

అక్షరటుడే నిజామాబాద్ సిటీ : Hospital Regulations | ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించే ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో గురువారం కలెక్టర్ అధ్యక్షతన క్లినికల్ ఎస్టాబ్లిష్​మెంట్ యాక్ట్​ అమలుపై సమావేశం జరిగింది.

Hospital Regulations | జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్..

ప్రతి ఆస్పత్రి తప్పనిసరిగా జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ కింద రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని కలెక్టర్​ (Collector Ila Tripathi) అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణ తీరు పట్ల ప్రత్యేక పర్యవేక్షణ జరుపుతూ, నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. అన్ని నిబంధనలు పాటించే ఆస్పత్రులకే అనుమతులు, రెన్యూవల్స్ చేయాలని సూచించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్​మెంట్ యాక్ట్ నిబంధనలు పాటించని ఆస్పత్రులకు అనుమతులు మంజూరు చేయకూడదని హెచ్చరించారు. ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగాలని, ఎవరైనా అవకతవకలకు ఆస్కారం కల్పించినట్లు ఫిర్యాదులు వస్తే ఎంతమాత్రం ఉపేక్షించబోమన్నారు.

Hospital Regulations | సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా..

సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా, ప్రభుత్వం రూపొందించిన కొత్త నిబంధనలపై ఆస్పత్రుల నిర్వాహకులు అవగాహన పెంపొందించుకుని, వాటిని తూచా తప్పకుండా పాటించేలా చూడాలన్నారు. పార్కింగ్ ఏరియా, అగ్ని ప్రమాద నివారణ జాగ్రత్తలు వంటివి విధిగా పాటించాలని, అన్ని ఆస్పత్రుల్లో వైద్య రుసుముల వివరాలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్ఎంపీల పట్ల నిఘా పెంచి అర్హత లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్న వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ పథకం కింద తక్షణ వైద్య సేవలు అందించేందుకు ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వాహకులు చొరవ చూపాలన్నారు. ఈ సమావేశంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్​పర్సన్ డాక్టర్ కవితా రెడ్డి, అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీఎంహెచ్​వో రాజశ్రీ, నిజామాబాద్, బోధన్ ఐఎంఏ శాఖల అధ్యక్షులు డాక్టర్ విశాల్, డాక్టర్ ముకరంజా, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Sabarimala Maha Padayatra | శబరిమలకు ‘సువర్ణ భూమి శబరిమల మహా పాదయాత్ర’ ప్రారంభం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *